Mohan Babu: మంచు ఫ్యామిలీ ఏమి చేసినా కూడా వైరల్ గా మారడం ఈ మధ్యకాలంలో సహజంగా మారింది. మంచు ఫ్యామిలీ నుండి మూవీ వచ్చినా, ఆ ఫ్యామిలీ ఏదన్న ఈవెంట్ లో పాల్గొన్నా ఆ ఈవెంట్ ఎక్కడ లేని వైరల్ కంటెంట్ ను, మీమ్ మెటీరియల్ ను ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ వైరల్ కంటెంట్ ను ఇవ్వడానికి విశాల్ నటించిన లాఠీ మూవీ వేదికగా నటుడు మోహన్ బాబు బయలుదేరారు. ఈ మూవీకి ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పబ్లిసిటీ లేదు. కానీ ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఆ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మోహన్ బాబు ఇప్పుడు ఆ మూవీకి కావాల్సిన ప్రమోషన్ ను ఇచ్చారు. లాఠీ మూవీ పోలీస్ వ్యవస్థ చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ వ్యవస్థను ఉద్దేశిస్తూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పోలీసులు అధికారంలో ఉన్న నాయకులకు తొత్తులుగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

పోలీసులు తొత్తులుగా మారారు

ఎంతో నిబద్దతతో పని చేస్తూ, శాంతి భద్రతలను కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పోలీసులు కూడా చట్టానికి అనుగుణంగా పని చెయ్యకుండా అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు లోబడి, తొత్తులుగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జరుగుతున్న విషయాలు తమకు(పోలీసులకు) తప్పని అనిపించినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరుకు ఏమి చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలను ఎన్నో తానూ చూశానని, నిజం చెప్తే ఉద్యోగం పోతుందనే భయపడే పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సమాజాన్ని కాపాడే పోలీసులను ఇలా స్టూడెంట్స్ ముందు ఇలా అవమానించేలా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే పోలీసులను అందరు గౌరవించాలని, వాళ్ళు కూడా మనలో నుండో వచ్చారని వ్యాఖ్యానించారు.

చెప్పింది నిజమేగా!!

మోహన్ బాబు చెప్పాడనే కాదు కానీ ఇప్పుడు పోలీసులపై సమాజంలో చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా ఉంటున్నారు లేదా వాళ్ళ ఆదేశాలను ధిక్కరిస్తే తమ ఉద్యోగం పోతుందని భయపడే వాళ్ళే ఉన్నారు. అయినా పోలీసులను శాసించే నాయకులు కరెక్ట్ లేనప్పుడు అధికారములు మాత్రం ఏం చేస్తారు. కొంతమంది పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో తోట్టులుగా మారుతుంటే ఇంకొంతమంది కావాలని తొత్తులుగా మారుతున్నారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో ఎవరు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా అతను చెప్పింది 100% కరెక్ట్, అందరి మనుషుల్లో ఉన్న మాట కూడా అదే. మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.