YCP, TDP: రాజకీయాల్లో నాయకులు ఎప్పుడూ సేఫ్ గానే ఉంటారు. వాళ్ళ వెనక డబ్బు కోసం, మందు కోసం, నమ్మకస్తుడన్న పిచ్చి నమ్మకంతో, కుల పిచ్చితో, మతపిచ్చితో తిరిగే వాళ్ళే చస్తూ లేదా చంపుతూ ఉంటారు . ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం ఉంది కానీ టీడీపీ, వైసీపీ మధ్య ఇప్పటి నుండే గొడవలు మొదలు అయ్యాయి. వైసీపీ నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ నుండి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ వీళ్ళ వెనక పనిలేక తిరిగే వాళ్ళు రాళ్లతో కొట్టుకు చేస్తున్నారు. ఈ పనికిమాలిన నాయకుల కోసం ఈ బుద్ది తక్కువ జనాలు ఎందుకు ఇలా కొట్టుకు చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. ఇలా కొట్టుకు చచ్చేవాళ్లకు వాళ్లపై ఆధారపడే వాళ్ళు ఉంటారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఇలా ఈ లీడర్స్ కోసం కొట్టుకు చస్తారు. మొన్న కందుకూరులో జరిగిన ఇదేం ఖర్మ అనే ఖర్మ కార్యక్రమంలో 8 మంది చచ్చిపోయినా కూడా ఇంకా ప్రజలు ఈ రాజకీయ నాయకులు పెట్టె సభలకు పోతున్నారు.
రాళ్లతో కొట్టుకు చస్తున్నారు
చిత్తూరు జిల్లా సోమల మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమల మండలంలోని పెద్ద ఉప్పరపల్లి, నంజంపేట తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు చల్లా వెళ్తుండగా సోమల దళితవాడ వద్ద వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రామచంద్రారెడ్డి నంజంపేటకు వెళ్లారు. అక్కడ టీడీపీ-వైసీపీ శ్రేణుల మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. టీడీపీ నేతలకు చెందిన పలు వాహనాల అద్దాల ధ్వంసమయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
వీళ్లకు పనులుండవా!!
అసలు ఈ రాజకీయ నాయకులు పెట్టె సభలకు ఈ జనాలు ఎందుకు వెళ్తారో ఎవ్వరికి అర్థం కాదు. ఎందుకంటే ఆ సభలో ఆ నాయకులు వీళ్లకు ఉపయోపడే ఒక్క మాట కూడా చెప్పారు కానీ ఈ జనాలు మాత్రం ఎక్కడికి పడితే అక్కడికి ఊపుకుంటూ వెళ్తారు. ఆ లీడర్ ఇచ్చే ముందుకు, డబ్బుకు ఆశపడి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న కందుకూరులో జరిగిన ఘటనలో 8 మంది టీడీపీ నాయకుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినా కూడా, ఆ చావును తన పార్టీ కోసం వాడుకుంటున్న టీడీపీ లాంటి పార్టీల జనాలు ఇంకా ఎందుకు వెళ్తున్నారో ఎవ్వరికి అర్థం కాదు. ఈ సభలకు వెళ్లే వాళ్లకు చెయ్యడానికి ఎలాంటి పనులుండవు. నిరుద్యోగులు, పనికిమాలిన వాళ్ళే ఈ మీటింగ్స్ కు వెళ్లారు.