హైద‌రాబాద్లోని అత్యంత ఖ‌రీదైన కోకాపేట్లో, ఉప్ప‌ల్ భ‌గాయ‌త్లోని బిసి ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాల‌కోసం ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లాలు బిసి సంక్షేమ శాఖకు స్వాదీన‌మైన నేప‌థ్యంలో బిసిల్లోని ఉప‌కులాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌న నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఉన్న‌తాదికారుల‌ను ఆదేశించడం జరిగింది. నాణ్య‌త‌తో కూడిన ప్ర‌పంచ స్థాయి శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు టెండ‌ర్ల‌ను త‌క్ష‌ణ‌మే ఆహ్వ‌నించాల్సిందిగా ఆదేశించారు. ఇప్ప‌టికే కోకాపేట్లో హెచ్ఎండిఏ మౌళిక వ‌స‌తుల్ని డెవ‌ల‌ప్ చేసిందని, ఉప్ప‌ల్ బ‌గాయ‌త్ లో సైతం మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ గారిని ఆదేశించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు బిసిల సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉన్నారని, అందుకోసం ఎన్ని నిధులు అవ‌స‌ర‌మైన అంధుబాటులో ఉంచారు, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని రాష్ట్రంలోని ప్ర‌తీ బిసి బిడ్డ‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చే విదంగా యాక్ష‌న్ ప్లాన్ రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించడం జరిగిందని, త్వ‌ర‌లోనే ఈ స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌తో సీఎం కేసీఆర్ గారిని క‌లుస్తామని, ఈ సంద‌ర్భంగా బిసి సంక్షేమ శాఖ ప‌రిధిలోని అన్ని కార్పోరేష‌న్ల‌లో అమ‌ల‌వుతున్న ఆర్థిక స‌హాయ ప‌థ‌కాలు, ఇత‌ర ప‌థ‌కాల గురించి స‌మ‌గ్రంగా స‌మీక్షించడం జరిగిందని అన్నారు.

బిసిల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి చర్యలు: మంత్రి గంగుల కమలాకర్ 

తాజాగా ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోయే ర‌జ‌కులు, నాయీ బ్రాహ్మ‌ణుల‌కు 250 యూనిట్ల ఉచిత క‌రెంటుతో పాటు, బిసి నిరుద్యోగ యువ‌కుల కోసం 25 ల‌క్ష‌ల వ్యయంతో ఇవ్వ‌ త‌ల‌పెట్టిన అత్యున్న‌త స్థాయి అంబులెన్స్ ల ప‌థ‌కం, ఇంకా ఇత‌ర ప‌థ‌కాల‌పై చ‌ర్చించడం జరిగింది. బిసిల్లోని అవ‌స‌రార్థుల‌ను గుర్తించి వారికి స‌మ‌గ్రంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరేవిదంగా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని, బిసిల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి అవస‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించడం జరిగింది.

ఈ స‌మావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ కార్మికుల‌కు మోపెడ్లు అందించాలని, గౌడ సొసైటీల్లోని అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికి స‌హాయం చేయాల‌ని విజ్ణ‌ప్తి చేసిన వెంట‌నే సానుకూలంగా స్పందించడం జరిగింది, గౌడ కుల‌స్థుల‌కు మోపెడ్లు అందించ‌డంతో పాటు పూస‌ల‌, మేద‌ర కుల‌స్థుల‌కోసం అందిస్తున్న పూస‌ల బండ్ల ప‌థ‌కం గురించి సైతం అధికారుల‌కు ఆదేశాలు జారి చేయడం జరిగింది.

దేశంలో ఏ రాష్ట్రం నిర్వ‌హించ‌న‌ట్టుగా బిసి సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తుంది, ప్ర‌పంచ‌స్థాయి నాణ్య‌త‌తో బిసి గురుకులాల్లో విద్యాబోద‌న అందిస్తుంది, బిసి స్ట‌డీ స‌ర్కిళ్ల ద్వారా బిసి విద్యార్థుల‌కు ఉద్యోగాల కోసం కృషి చేస్తున్నాం.

ఈ కార్య‌క్ర‌మంలో బిసి సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం గారు, బిసి సంక్షేమ శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 31, 2021 at 5:14 సా.