Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేసే ప్రతి అడుగు చర్చనీయాంశం అవుతుంది. ఆయన వచ్చే ఎన్నికల్లో సీఎంగా గెలిచే నాయకుడని ఎవ్వరూ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పలేరు కానీ సీఎంగా వేరేవాళ్లను గెలిపించే సత్తా ఉన్న నాయకుడని ఎవ్వరిని అడిగినా కూడా చాలా ఖచ్చితంగా చెప్పగలరు.అందుకే పవన్ కళ్యాణ్ చుట్టూ ఆంధ్రప్రదేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ఇప్పటికే రెండు పార్టీలు చెప్పకనే చెప్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసి కూడా కనీసం ఒక్కచోట కూడా గెలవకుండా ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడనుకునే ఒకే స్థానం నుండి పొట్టి చెయ్యడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.
పిఠాపురం లేదా కాకినాడ రురల్!!
వచ్చే ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా గెలిచి, అసెంబ్లీకి వెళ్లాలని పవన్ కళ్యాణ్వ్యూహాలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉన్నా కూడా తానూ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చెయ్యాలని, వాటినే అడిగి తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కాపు ఓటర్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటె అక్కడ నుండి పోటీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో పిఠాపురం లేదా కాకినాడ రురల్ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ స్థానాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే అక్కడి నుండి పోటీ చెయ్యడానికి పవన్ సిద్ధమయ్యారు. గతంలో కాకినాడ రురల్ నుండి కన్నబాబు ప్రజారాజ్యం తరపున గెలిచారు. అలాంటి స్థానంలో పవన్ నిలుచుంటే ప్రజలే గెలిపించుకుంటారని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కుల బలం లేకపోతే కష్టమేనా!!
వచ్చే ఎన్నికలో ఎలాగైనా గెలవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు మాత్రమే ముఖ్యమన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఒంటరిగా వెళ్తే గెలిచే సత్తా లేదు కాబట్టే టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని బహిరంగంగా చెప్తున్నాడు. సరికొత్త రాజకీయాలు చెయ్యడానికి తానూ పాలిటిక్స్ లోకి వస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అందరి నాయకుల్లా కులాలు, మతాలు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కనీసం ఎలాంటి డబ్బు పంచకుండా పోటీకి వెళ్లారన్న భావన ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి డబ్బులు పంచక తప్పదు. ఎంతో నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల వల్ల అవినీతి మారక పూసుకోకతప్పడం లేదు. అయినా ప్రజల కోసం ఇన్నిరోజులా ఇంతలా కష్టపడ్డా తరువాత కూడా ఇంకా కులాన్ని పవన్ అడ్డుపెట్టుకుంటున్నాడంటే, పవన్ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.