Ali: వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్క్కడి నుండి పోటీ చేస్తాడనే విషయంపై ఇప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా పవన్ ను వచ్చే ఎన్నికల్లో తాము గెలిపించుకుంటామని, ఆయనకు అండగా ఉంటామని టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడా నిల్చుకున్నా కూడా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, ఆయనను ప్రజలే ఓడిస్తారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇవ్వాళ నగరిలో జరిగిన ఒక మీటింగ్ లో నటుడు, వైసీపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా నాయకుడు ఆలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పోటీ చేస్తానని ఆలీ స్పష్టం చేశారు. అయితే దీన్ని పట్టుకొని సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన నాయకులు గొడవ పడుతున్నారు.Ali

ఆలీ కూడా గెలుస్తాడా!!

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అనే రెండు నియోజక వర్గాల్లో పోటీ చేసి, ఓడిపోయారు. కానీ వైసీపీకి, టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. కనీసం పవన్ కళ్యాణ్ అయినా గెలుస్తాడని అంతా అనుకున్నారు కానీ అతను కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ చూపిస్తూవైసీపీ వాళ్ళు పవన్ ను కించపరుస్తున్నారు. ఇప్పుడు అలీ కూడా అదే మాట అంటున్నారు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తిపై జగన్ ఆదేశిస్తే తానూ నిలబడతానని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబు నాయుడును ఓడించాలని జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుండో కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ పై ఆలీని కూడా నిలబెట్టి గెలిపించే సత్తా వైసీపీకి ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులే తమను తెలిపిస్తాయని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

పవన్ కు అర్హతా లేదా!!

రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్, మహిళా మంత్రి మంత్రి అయిన రోజాను డైమండ్ రాణి అని కించపరడం సరికాదని, పవన్ కు కనీసం ఆ అర్హత కూడా లేదని ఆలీ తెలిపారు. అత్యంత ప్రజాధారణ కలిగిన రోజాను పవన్ అలా అనకుండా ఉండాల్సిందని ఆలీ తన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన, బీజేపీని ఓడించడానికి జగన్, వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆలీ తెలిపారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తనకు సీట్ కంఫర్మ్ చెయ్యలేదు ఇప్పుడే పవన్ పై పోటీ చేస్తానా లేదా అనే విషయాన్ని చెప్పలేనని ఆలీ స్పష్టం చేశారు. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలే వైసీపీ 175 స్థానాల్లో గెలిచేలా చేస్తుందని ఆలీ ధీమా వ్యక్తం చేశారు. సినిమాలను, రాజకీయాలను ముడిపెట్టి చూడలేమని, అక్కడ ఉన్న క్రేజ్ ఇక్కడ పనికి రాదని ఆలీ తెలిపారు.