Bandi Sanjay: తెలంగాణలో బీజేపీకి ఇప్పుడిపుడే కొత్త వరకు ఆదరణ పెరుగుతుంది కానీ బీజేపీనేతలు చేస్తున్న చిల్లర పనుల వల్ల ఉన్న ఆ ఆదరణ కాస్త పొయ్యేలా ఉంది. ఎలాంటి ప్రజలకు మంచి చేసే మేనిఫెస్టో లేకుండా కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని దేశంలో ఉన్న బీజేపీ నాయకులందరు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా మొన్నటి వరకు బండి సంజయ్ పాద యాత్ర చేశారు కానీ ఎలాంటి మేనిఫెస్టో కానీ ప్రజా సమస్యల గురించి కానీ మాట్లాడకుండా కేవలం మతాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని ముగించారు. అయితే ఇప్పుడు బండి సంజయ్ పై మరో కొత్త ఆరోపణలు వస్తున్నాయి. అదేంటంటే పార్టీ కార్యకలాపాల కోసం కార్యకర్తల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బును కూడా నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నిక అయినప్పటి నుండో ఎదో ఒక ఆరోపణ ఎదుర్కొంటునే ఉన్నారు. ప్రజలను బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు కార్యకర్తల నుండి చందాలు తీసుకోని వాటిని కూడా నొక్కేస్తున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీర అవుతున్నాయి.
చందాలు వసూలు చెయ్యడం ఏందీ!!
బీజేపీ జాతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ. అలాంటి పార్టీ ఇలా చీప్ గా కార్యకర్తల దగ్గర నుండి, నాయకులు దగ్గర నుండి డబ్బులు వసూల్ చెయ్యాల్సిన అవసరం ఏముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి . అలాగే ఈ డబ్బును కొత్త వరకు మాత్రమే డిజిటల్ మోడ్ లో తీసుకుంటున్నారని, మిగితాది నేరుగా తీసుకుంటున్నారని, వాటికి ఎలాంటి లెక్కలు లేవని బీజేపీ నాయకులే అంటున్నారు. ఐన ఇలా డబ్బులు వసూల్ చెయ్యడం ఏంటని బీజేపీలోని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బలపడుతున్న నేపథ్యంలో ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఉన్న ఆ కాస్త ఆదరణ కూడా పోగొట్టుకునిలా బీజేపీ నాయకుల ప్రవర్తిస్తున్నారు.
సంజయ్ ఇన్ని చేశాడా!!
బండి సంజయ్ పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయ్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ప్రజల నుండి సంజయ్ డబ్బులు వసూల్ చేస్తున్నారని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి. మొదటగా ఆయన కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారని చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులంటూ హడావుడి జరిగింది. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఆ తర్వాత ఆయన పలు చోట్ల భూములు కొన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా అధికారంలోకి రాకముందే ఇలాంటి పనులు చేస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకెన్ని మోసాలు చేస్తారో ఈ బీజేపీ నాయకులు. అయినా ఒక జాతీయ పార్టీ ఇలా డబ్బులు అడగటం మాత్రం కామెడీగా ఉంది.