KCR: 2019 ఎన్నికల సమయం వరకు టీడీపీ, బీజేపీ మధ్య చాలామంచి సంబంధాలు ఉండేవి. కానీ ఎన్నికల సమయంలో మాత్రం రెండు పార్టీల మధ్య చాల దూరం పెరిగింది. టీడీపీ నాయకులు పార్లమెంట్ లో కూడా టీడీపీ నాయకులు వ్యతిరేకంగా పోరాడింది, మోడీ ఇంటిని కూడా ముట్టడించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. బీజేపీ తమకు నిధులు, అప్పుల విషయంలో అన్యాయం చేస్తుందని టీడీపీ నాయకులు గొడవ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు కేసీఆర్ కు బీజేపీతో సేమ్ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులపై పోరాడటానికి కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో యుద్ధానికి కేసీఆర్ సమరశంఖం పూరించారు. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడి, రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెయ్యడానికి వ్యుహాం రచించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న యుద్ధాన్ని, అప్పట్లో టీడీపీ చేసిన దాన్ని చూసిన వాళ్ళు మాత్రం రానున్న రోజుల్లో టీడీపీకి పట్టిన గతే కేసీఆర్ కు కూడా పట్టనుందని చెప్తున్నారు.
బాబులానే కేసీఆర్ కూడానా!!
గతంలో బాబు ఎలాగైతే బీజేపీపై పోరాడారో ఇప్పుడు కేసీఆర్ కూడా అలానే పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పనులు, ప్రాజెక్టులు.. విభజన హామీలన్నింటిపై పట్టుబట్టాల్సిందేనని ఎంపీలకు దిశానిర్దేశం చేసి పంపించారు. వారు పార్లమెంట్‌ను అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అప్పుడు బాబు బీజేపీకి ఎదురు తిరిగారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహాయం అందలేదని, ఇప్పుడు కేసీఆర్ కూడా ఎన్నికల్లో గెలిచినా కూడా కేసీఆర్ కు కూడా బీజేపీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందదని, రాష్ట్రానికి కూడా చాల ఇబ్బందులు రానున్నాయని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో బాబు వల్ల ఏపీకి ఎలాంటి గతి పట్టిందో అలంటి గతే తెలంగాణకు కూడా పట్టనుంది.
వైసీపీ సపోర్ట్ చేస్తుందా!
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న సంబంధం గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ బీజేపీకి దాసుడిలా పని చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మాత్రం బీజేపీతో పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే ఈ యుద్ధానికి మాత్రం జగన్ అస్సలు రావడం లేదని, రాడని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వైసీపీ ఎదురు తిరిగితే జగన్ కు కష్టాలు తప్పవు కాబట్టి జగన్ కేసీఆర్ కేంద్రంతో పోరాటానికి ఎలాంటి మద్దతు ఇవ్వరని తెలుస్తుంది. వైఎస్ జగన్ ఎప్పుడైతే ఏపీకి సీఎం అయ్యారో అప్పటి నుంచి కేంద్రంతో సన్నిహితంగానే ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావల్సిన ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నారని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్‌తో దూరంగానే ఉంటారని, జగన్ తన వ్యూహానికి తగ్గట్టు నడుచుకుంటారని తేల్చేశారు.