pawan kalyan
pawan kalyan

Pawan Kalyan: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూస్తే దాదాపు అన్నీ పార్టీల నాయకులు భయపడుతున్నారు. తనకు ఎదురు వచ్చిన వారందరిపైకి ఈడీ, సిబిఐలను ఉపయోగించి భయపెడుతూ ఉంటారు. అలాంటి బీజేపీని ఇప్పుడు ఏపీలో జనసేన లాంటి ఒక చిన్న పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆడిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపై ఏపీలో బీజేపీ యొక్క రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది . జనసేన ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంది. జనసేనకు ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఉంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకోవడానికి చూస్తున్నారు. కానీ బీజేపీకి టీడీపీతో ఉండటం అస్సలు ఇష్టం లేదు. రాష్ట్రంలో రాజకీయాలను కీలక మలుపు తిప్పడానికి బీజేపీ తీసుకునే ఒకే ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ బీజేపీ కూడా టీపీడీ-జనసేన పొత్తులో ఉంటె వైసీపీకు వచ్చే ఎన్నికల్లో చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.

pawan kalyan

టీడీపీతో బీజేపీ కలుస్తుందా!!

శాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన రోడ్ మ్యాప్ పై జనసేనకు పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిందని భావించారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులతో వెళతామని పవన్ ప్రకటించడంతో ఏపీ బీజేపీ నేతల గొంతుల్లో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. ఇప్పుడు బీజేపీకి టీడీపీతో కలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీకి ఇప్పుడు టీడీపీ కంటే కూడా వైసీపీతోనే ఎక్కువ పని ఉంది. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పొత్తునే గెలుస్తుందనే నమ్మకం వచ్చే రోజుల్లో వస్తే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి వస్తే వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది!!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు పొత్తు రాజకీయాలను తట్టుకొని వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి వైసీపీ ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి. ఎంతమంది పొత్తు పెట్టుకున్నా కూడా తమకు వచ్చే నష్టమేమి లేదని, అందరిని కలిపి ఓడించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తాము చేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు జగన్ కు మద్దతుగా ఉంటారని, వైసీపీకి ప్రజలే పొత్తుగా ఉండి గెలిపిస్తుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చుస్తే వీళ్ళందరూ కలవడం వైసీపీకి కలిసొచ్చే అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలా పొత్తులతో వస్తే, తానూ ఒంటరిగా ఎన్నికలకు వస్తున్నానని సింపతీ గేమ్ ఆడి, జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే సింపతీని వాడుకోవడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.