Bjp:గ్రూప్స్ పరీక్షలను బీజేపీ నాయకులు అడ్డుకోనున్నారా!!

Arjun

Bjp:కుల, మాత రాజకీయాల మీద మాత్రమే ఆధారపడ్డ పార్టీ కేంద్రం స్థాయిలో ఏదన్న ఉందంటే అది బీజేపీ పార్టీనే. రాష్ట్రంలో, దేశంలో కుల, మాత కలహాలను రెచ్చగొట్టడానికి ఎలాంటి సందర్భాన్నైనా వాడుకోగలరు. ఇలా ప్రతి విషయాన్ని మతానికి ముడి పెట్టి విద్వేషాలను రెచ్చగొట్టడానికి

is bjp party trying to stop groups exams

బీజేపీ నాయకులను ఎలాంటి మొహమాటం ఉండదు. శవాలపై రాజకీయాలు చేసే అలవాటు బీజేపీ నాయకులకు మొదటి నుండి ఉన్న అలవాటే.

గ్రూప్స్ పరీక్షలను బీజేపీ అడ్డుకుంటుందా!!

రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో యువత ప్రేపరేషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా తెరాసా ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం ఈసారి గ్రూప్స్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు ఉర్దూలో కూడా రాయాయవచ్చు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఉర్దూ పరీక్ష పెడితే మొత్తం ఉద్యోగాలు ముస్లింలకే వస్తాయని బీజేపీ నాయకులు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. కష్టపడి చదివిన వారికి ఉద్యోగం వస్తుందన్న కనీస విజ్ఞత లేకుండా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు.

ఉర్దూలో పరీక్షా పెట్టడం తప్పా!!

భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుందని తెరాసా నాయకులు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పటికే తెరాసా ప్రభుత్వం యొక్క రాజకీయ లబ్ది కోసం నోటిఫికేషన్ విడుదల ఆలస్యం చెయ్యగా, ఎలాగోలా నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ పనికిమాలిన రాజకీయ నాయకుల గొడవలతో యువత తప్పుదోవ పెట్టె అవకాశం ఉంది. ఏ మతం వారికైనా, కులం వారికైనా పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించడం ఎలా తప్పవుతుందో మత రాజకీయాలు చేసే బీజేపీ నాయకులకే తెలియాలి.

- Advertisement -