YS VIVEKANANDA REDDY:2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య ఎవరు చేశారన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ హత్య చేసిన వారిని కనిపెట్టడానికి సిబిఐ తీవ్రస్థాయిలో విచారణ చేపడుతుంది. ఇప్ప్పటికే ఈ విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై అధికారులు నిఘా పెట్టి, ఈ హత్యలో వారి హస్తం ఉందొ లేదో అనే అంశంపై విచారణ చేపడుతుంది.

అయితే ఈ హత్య విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల హస్తం ఉందని పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ హత్య వెనక మరో పెద్దమనిషి ఉన్నారని, ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించే పనిలో అధికారులు ఉన్నారని సమాచారం.
ఎవరా పెద్దమనిషి!!
ఈ హత్య విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేస్తే కేస్ క్లోజ్ అవకాశం ఉన్నప్పటికీ, అలా జరగకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నారని, అలా అడ్డుకోవడానికి బలమైన కారణమని ఉందని పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినాష్, భాస్కర్ లను అరెస్ట్ చేస్తే, వాళ్ళ వెనకున్న అసలు వ్యక్తిని బయటకు వస్తారని, ఆ వ్యక్తిని బయటకు రాకుండా ఉండేదుకే జగన్ అడ్డుపడుతున్నారని సమాచారం. హత్య వెనక ఉన్న వ్యక్తిని కాపాడటానికే వైసీపీ, బీజేపీకి దగ్గరా ఉంటుందని, విచారణలో జాప్యానికి కూడా ఇదే కారణమని సమాచారం.
సిబిఐ షాక్ ఇవ్వనుందా!!
త్వరలోనే వివేకా హత్య విషయంలో సిబిఐ అధికారులు ముగింపు ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇప్పటికే ఈ కేసు విషయంలో చాల జాప్యం అయిందని, ఇక మీద ఎవ్వరి ఒత్తిడికి లొంగకుండా హంతకులను బయటపెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ హత్య ఎవరు చేశారన్న విషయం బయటపడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పులే వస్తాయి. టీడీపీ నాయకులు చేయించారని వైసీపీ నాయకులు, వైసీపీ నాయకులే ఎన్నికల్లో గెలవడానికి హత్య చేశారని టీడీపీ నాయకులు నిందలు వేసుకుంటున్న నేపథ్యంలో హత్య చేసిన వారు ఎవరో తెలిస్తే అధికారం కోసం రాజకీయ నాయకులు ఎలాంటి గడ్డి తింటారో ప్రజలకు అర్ధమవుతుంది.