CBN: చంద్రబాబు నాయుడు జైల్ కు వెళ్లి ఇప్పటికే దాదాపు రెండు నెలలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆయనకు బెయిల్ వస్తుందన్న నమ్మకం ఎవ్వరికి లేదు. ఇప్పటికే ఆయన మీద రెండు కేసులు పెట్టిన ఏపీ సీఐడీ ఇప్పుడు మరో కేసును పెట్టడానికి సిద్ధమైంది. మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై పీడీ యాక్ట్ కింద కేసును నమోదు చేసి, ఆ ఎఫ్ఐఆర్ ను ఏసీబీ కోర్ట్ కు అందజేసింది. ఇప్పటికే ఉన్న కేసుల్లోనే సీబీఎన్ కు బెయిల్ రావడం లేదు, ఇప్పుడు కేసు కూడా తోడవ్వడంతో ఇంకా బైలు ఎప్పుడు వస్తుందోనని టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే కొన్ని రోజుల కిందనే మద్యం కంపెనీలకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అనుమతులు ఇచ్చిందని అసెంబ్లీలో వీడియో ప్లే చేసి మరి సీఎం జగన్మోహన్ రెడ్డివివరించారు.

టీడీపీ లాస్ట్ మూవ్మెంట్ లో కూడా అనుమతులిచ్చిందా!!
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తరువాత కొత్త మద్యం కంపెనీలకు చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు అమలులో ఉన్న మద్యం కంపెనీలకు సీబీఎన్ యే అనుమతులు ఇచ్చారని జగన్ అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేమ్ అదే విషయంలో ఏపీ ఏసీబీ అధికారులు మరో కేసును నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయంలో టీడీపీ నాయకులు స్పందిస్తారో వేచి చూడాలి. మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్స్ పై టీడీపీ నాయకులు జోకులు వేసేవారు, ఇప్పుడు అదే కేసులో బాబుపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుల నుండి టీడీపీ నాయకుడు ఎప్పుడు బయటకు వస్తాడో వేచి చూడాలి.
టీడీపీకి మళ్ళీ ఓటమి తప్పదా!!
సీబీఎన్ జైలుకు వెళ్లినప్పటి నుండి రాష్ట్రంలో టీడీపీ హడావిడి దాదాపు తగ్గిపోయింది. టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు పార్టీని నడిపించాల్సిన బాధ్యత లోకేష్ కు ఉన్నప్పటికీ, ఆయన ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహించడం లేదు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మ క్రియేట్ చేసిన, ఇంపాక్ట్ ఇప్పుడు బయట ఉన్న లోకేష్, బ్రాహ్మిణి, భువనేశ్వరి క్రియేట్ చేయలేకపోతున్నారు. పైగా తొందర్లోనే బయటకు వస్తారని, సీబీఎన్ ఎలాంటి తప్పు చెయ్యలేదని చెప్తున్నప్పటికీ, బెయిల్ ఇంకా రాకపోవడం, ఇంకా కేసులు పెరుగుతూ ఉండటం వల్ల టీడీపీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓటమి తప్పదేమోనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.