Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉంది కానీ ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుండే అన్ని పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే ఇంకా సమయం ఉన్నా కూడా తాము వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నట్టు టీడీపీ-జనసేన నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. దాదాపు ఈపొత్తు వచ్చే ఎన్నికల్లో కంఫర్మ్ గా కనిపిస్తుంది. అయితే పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ కంటే కూడా చంద్రబాబు నాయుడుకే ఎక్కువ అవసరం ఎందుకంటే వచ్చేసారి కూడా వైసీపీని అధికారకంలోకి వస్తే టీడీపీ భూస్థాపితం చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు నష్టం జరుగుతుందని అంతా అనుకుంటున్నారు కానీ ఈపొత్తు వల్ల జనసేనకే లాభమని రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి
తానూ సీఎంగా ఉండకుండా వేరే వాళ్ళను ఇంకోసారి సీఎం చేసే బుద్ధి తక్కువ పని పవన్ కళ్యాణ్ చెయ్యడని, చంద్రబాబు నాయుడే కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఉండవల్లి తెలిపారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిస్తే,టీడీపీని భూస్థాపితం చేస్తాడని, ఆ విషయం చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసని,అందుకే జనసేనతో పొత్తు పెట్టుకొని అయినా సరే వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు. తానూ అధికారంలోకి రావడం కంటే కూడా టీడీపీని బతికించడం ముఖ్యం కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా బాబు త్వరలోనే ప్రకటిస్తారని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు సీఎంగా ఉన్న పని చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను సీఎంగా పెట్టి, తాను అతని కోసం పని చేస్తాడా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది.
లోకేష్ ఎప్పటికీ కార్యకర్తేనా!!
నారా లోకేష్ కు ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకన్న పేరు తప్పా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇంకా ఏర్పరచుకోలేదు. కనీసం ఒక్కసారిగా ఎలక్షన్స్ లో గెలవలేదు. గత ఎన్నికల్లో పోటీ చేస్తే, ప్రజలు లోకేష్ ను ఓడించారు. లోకేష్ ప్రజల్లో ఎలాంటి గుర్తింపు లేకున్నా కూడా అతన్ని సీఎంను చెయ్యాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే లోకేష్ ను సీఎంగా చెయ్యడానికి బాబు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల బాబు తరువాత ఎక్కువ ప్రాధాన్యత పవన్ కు ఉంటుంది. అలాంటప్పుడు లోకేష్ ను సీఎం చెయ్యడం అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో లోకేష్ ప్రూవ్ చేసుకోకపోతే లోకేష్ ఇంకా ఎప్పుడూ కార్యకర్తగానే ఉండాల్సి వస్తుంది.