Chandrababu Naidu: 2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాన్ని ఇంకా టీడీపీ, జనసేన నాయకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో తాము మిస్టేక్స్ గుర్తుచేసుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. తాము విడివిడిగా పోటీ చేసి, కట్టబెట్టామని విశ్లేషణలు చేసుకుంటూ ఉన్నారు.

అయితే 2019 ఎన్నికల్లో చేసిన మిస్టేక్ ను మళ్ళీ చెయ్యకూడదని టీడీపీ, జనసేన నాయకులు నిర్ణయించుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో మాదిరి మళ్ళీ జనసేన, టీడీపీ కలిసేలా ఉన్నారు.
బాబు నోటా పవన్ మాట
బాదుడు బాదుడే అనే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ” మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చెయ్యాలని”అన్నారు . అచ్చం ఇలాంటి మాటలనే పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కూడా పలికారు. ఈ మాటలు విన్న ప్రజలు మళ్ళీ టీడీపీ, జనసేన నిజంగానే కలిసేలా ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
పవన్ కు బాబు విలువ ఇస్తారా!!
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినప్పటికీ, చంద్రబాబు ఇద్దరు కలిసి ఎన్నికలకు కలిసి వస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. ఈ కలరింగ్ కాస్త వైసీపీ కలిసి వచ్చింది. టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతతో ప్రజలు జనసేనకు కూడా ఓటు వెయ్యకుండా మొత్తం వైసీపీకే అధికారం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అయినా బాబు పవన్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, కలిసి పని చేస్తేనే వైసీపీని ఓడించగలరు.