Amith shah: ఏపీలో ఇంకొక ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయి. వాటి కోసం ఇప్పటి నుండే పొత్తుల రాజకీయాలను అన్నీ పార్టీల నాయకులు మొదలుపెట్టారు. పొత్తులు ఉంటే తప్పా గెలవలేని టీడీపీ, ఇప్పటి నుండే బీజేపీతో , జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.చంద్రబాబు నాయుడుకు పొత్తుల విషయంలో ఎలాంటి విలువలు ఉండవు, ఎందుకంటే గతంలో తెలంగాణాలో కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు అలంటి పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల కోసం, మళ్ళీ సీఎం కావడానికి జనసేనకు, బీజేపీకి వల వెయ్యడానికి సిద్ధమయ్యారు. అయితే ఈరెండు పార్టీల నేతలు బాబును అంతగా పట్టించుకుంటున్నట్టు లేరు. అందుకే ఇప్పుడు నేరుగా బీజేపీ నేత అమిత్ షాను కలవడానికి సిద్ధమయ్యారు.

అమిత్ షాను కలవనున్నారా!!
ప్రస్థుతానికి బీజేపీ -జనసేన పొత్తులో ఉన్నాయ్. వచ్చే ఎన్నికల సమయానికి ఈరెండు పార్టీలు పొత్తులో ఉంటాయో లేదో ఎవ్వరికి తెలియదు. కానీ వీడిపోతున్నట్టు ఈరెండు పార్టీలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా అమిత్ షాను కలవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి . అయినా కనీసం డిపాజిట్స్ కూడా రాని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకింత ప్రయత్నిస్తున్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడానికి బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని, వైసీపీని ఓడించి, మళ్ళీ అధికారంలోకి రావడానికి బాబు ప్రయత్నిస్తున్నారు.
జనసేన బయటకు వస్తుందా!!
చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న వేళ, బీజేపీతో ఉన్న పొత్తును తెంచుకోవడానికి జనసేన ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఒకవేళ జనసేన, బీజేపీతో ఉన్న పొత్తును తెంచుకుంటే వచ్చే ఎన్నికల సమయానికి ఖచ్చితంగా టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటారు. బీజేపీతో ప్రస్తుతానికి పొత్తు లేకపోయినా కూడా గెలిచిన తరువాతైనా బీజేపీతో కలవడానికి బాబు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ఇప్పటివరకు ఆర్థిక అభివృద్ధి ఏమి చెయ్యకపోయినా కూడా సంక్షేమ పథకాలను మాత్రం చాల ఖచ్చితంగా అందరికి అమలు చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ వల్ల వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచే అవకాశం ఉంది. టీడీపీ ఎంత ప్రయత్నించినా కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.