Revanth Reddy: ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అనే పార్టీ ఉందని కూడా చాలామంది మర్చిపోతున్నారు. తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నాయకులు చెప్పినా ఒక్కరు కూడా వినడం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణాలో ఎంతో కొంత ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే దానికి ఒక ముఖ్య కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ వల్ల ప్రజలకు ఇంకా కాంగ్రెస్ ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి, స్థానిక నేతలు నుండి ఇబ్బందులు మొదలు అయ్యాయి. అయితే మొదటి నుండి స్థానిక నేతల నుండి వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడు జాతీయ నేతలను నుండి కూడా ఇబ్బందులు మొదలు అయ్యాయి. రేవంత్ రెడ్డికి ఈ కష్టాలు రావడానికి మునుగోడు ఉప ఎన్నిక. ఈ ఎన్నిక కోసం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహమే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కష్టాలు తెచ్చాయని చెప్పొచ్చు.

ఉప ఎన్నికలో గెలుస్తాడా!!
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మొత్తం బీజేపీ, టిఆర్ఎస్ చుట్టూనే తిరుగుతుంది. నిజానికి మునుగోడు కాంగ్రెస్ స్థానం. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అసలు కాంగ్రెస్ అనే పార్టీ ఉందని మునుగోడు లాంటి ప్రజలు కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ కు వచ్చిన కష్టాల్లో మునుగోడు ఎన్నిక కూడా ఒకటి. ఇప్పుడు ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే రేవంత్ కష్టాలు మరింత పెరిగేలా ఉన్నాయ్. ఈ ఎన్నికలో ఓడిపోతే రేవంత్ ను పీసిసి అధ్యక్షుడి నుండి కూడా తొలగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి నిలపాలంటే ఈ ఉప ఎన్నికలో గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గెలవకపోతే కాంగ్రెస్ కు చాలా పెద్ద అవమానం. అయితే పరిస్థితి చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అలాగే కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా పెద్దగా లేవు. కనీసం ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికే కూడా కాంగ్రెస్ నుండి నిధులు రావడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.
కాంగ్రెస్ పెద్దల ఆగ్రహం
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు రాహుల్ భారత్ జూడో పాదయాత్ర చేస్తున్నారు . ఈ పాదయాత్ర ప్రజల నుండి కూడా మద్దతును పొందగలిగింది. అయితే ఇప్పటికే ఈ యాత్ర ఏపీలోకి ఎంటర్ ఐంది. అయితే ఈ యాత్రకు సంబంధించిన ప్రమోషన్ ను రేవంత్ రెడ్డి అస్సలు చెయ్యడం లేదని కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాండింగ్ చెయ్యడంలో రేవంత్ కు ఉన్న మార్క్ అందరికి తెలుసు కానీ ఇప్పుడు భారత్ జూడోకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను, జూడో యాత్రను విజయవంతం చెయ్యకపోతే రేవంత్ ను పీసీసీ నుండి తొలగించడానికి కూడా సిద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.