Revanth Reddy: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఇంకొన్ని రోజుల్లో ప్రజలు మర్చిపోయే స్థాయికి కాంగ్రెస్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం స్థానం నుండి ఇప్పుడు దాదాపు ప్రజలు మర్చిపొయే స్థాయికి పార్టీని కాంగ్రెస్ నాయకులే తీసుకోని వచ్చారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఎలా దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులపైనే వ్యూహాలు రచిస్తూ విచిత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న గొడవలన్నీ తొలిపోయాయాని, నాయకులమంతా కలిసే ఉన్నామని నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి నిర్వహించిన దళిత, గిరిజన గౌరవ సభలో రేవంత్ రెడ్డి తెలిపారు. టీపీసిసి ఇంచార్జి గా మాధవ్ రావు ఠాక్రే వచ్చిన పార్టీలో సమస్యలన్నీ కూడా తొలిగిపోయాయని తెలిపారు. అయితే ఈ విషయాన్నీ రేవంత్ తప్పా కాంగ్రెస్ లో ఉన్న ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు. కాంగ్రెస్ నాయకులకు పార్టీ కంటే , అధికారంలోకి రావడం కంటే కూడా తమ సొంత ప్రయోజనాలు ఎక్కువయ్యాయి.

దళితులకు అండగా ఉంటాం
పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రశ్నించిన నాగం జనార్దన్ రెడ్డిని, ఆయన వెంట వెళ్లిన దళితులను, గిరిజనులను కేసీఆర్ ప్రభుత్వం దాడి చేసిందని, దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దొరలకు బీఆర్ఎస్ పార్టీ, పెట్టుబడిదారులకు బీజేపీ పార్టీలు ఉన్నాయని, దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వాళ్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే గతంలో రెడ్లు సీఎంలు అయితే రాష్ట్రం బాగుపడుతుందని క్యాష్టిస్ట్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి ఇవ్వాలా ఇలా దళితుల గురించి, గిరిజనుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందా!!
ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా పార్టీలోని గొడవలను సరిదిద్దుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు గొడవలు లేవని రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇక నుండైనా పార్టీ నాయకులంతా కలిసి, అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. అయినా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లినా కూడా కాంగ్రెస్ ను ఇంకా ప్రజలు ఆదరించే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. మత పరమైన రాజకీయాలు చేసే బీజేపీకి కూడా ప్రజల్లో ఇప్పుడు ఆదరణ ఎక్కువగానే ఉంది. దాన్ని దాటుకొని, బీఆర్ఎస్ ను ఓడించి , అధికారంలోకి రావడమంటే కాంగ్రెస్ కు అంత ఈజీ పని కాదు. కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో చూడాలి.