RAGHURAMA: వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికల్లో గెలిచి, వైసీపీకే ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న నర్శపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గత రెండున్నరేళ్లుగా ఆయనను నియోజక వర్గంలోకి రానివ్వడం లేదు. ఆయన నియోజక వర్గంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే ఆయనపై ఇష్టమొచ్చిన కేసులను వైసీపీ పెట్టించి, ఆయనకు ఇబ్బంది పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఓసారి నియోజక వర్గానికి రావడానికి సిద్ధమైతే వైసీపీ చాల కేసులను ఆయనపై మోపింది. అందుకే రఘురామ నియోజకవర్గానికే రావడం లేదు.

అయితే ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఒంటరిగా రావడం లేదు, ఆయన ప్రధాని మోదీతోపాటు వస్తున్నారు. మోడీతో పాటు వస్తున్నా ఆయనకు అడ్డుకునే దమ్ము, ధైర్యం వైసీపీకి ఉందొ లేదో చూడాలి.
మోడీతో పాటు
ఇన్నాళ్లంటే రఘురామాను నియోజకవర్గంలోకి రాకుండా వైసీపీ అడ్డుకోగలిగింది కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అడ్డుకోలేదని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్నారు. నియోజకవర్గ ఎంపీగా రఘురామ కూడా పాల్గొనాల్సి ఉంది. దీంతో జూలై రెండో తేదీన ఆయన నియోజవకర్గానికి వస్తారు. ఇప్పుడు ఆయనను అడ్డుకోవడానికి అరెస్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.ప్రధానితో వస్తున్నా కూడా రఘురామను వైసీపీ అడ్డుకుంటుందేమో చూడాలి. అయినా ఒక్క్కడే అధికారంలో ఉన్న పార్టీకి చుక్కులు చూపించడం మాత్రం రఘురామకే సాధ్యం.
జగన్ కూడా రానున్నారా!!
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్న నేపధ్యంలో ఎలాగో ఎంపీగా రఘురామ పాల్గొననున్నారు. అయితే ప్రధాని రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ వస్తే మాత్రం ఒకే వేదికపై సీఎం జగన్, ప్రధాని, రఘురామను చూస్తాం. ఈ విజువల్ సాధ్యం కాదని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు మోడీ వల్ల ఈ అద్భుతం జరిగేలా ఉంది. అయినా ఇన్ని రోజులు తనను ఇంత ఇబ్బంది పెట్టిన రఘురామతో జగన్ వేదిక పంచుకోవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.