Ys Jagan Mohan Reddy:వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ జన్మలోనే వచ్చే జన్మలో కూడా నెరవేర్చలేరు ఎందుకంటే వైసీపీ నాయకులకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు కాబట్టి. ప్రత్యేక హోదా సాధిస్తామనే నినాదంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎదురించి ప్రత్యేక హోదా తెస్తామని వైఎస్ జగన్ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి సేవకుడిలా జగన్ ఉన్నారు. కనీసం బీజేపీని ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా అడిగిన దాఖలాలు లేవు పైగా ప్రతి విషయంలో బీజేపీకి మద్దతిస్తునే ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా ఇంత విశ్వాసంగా మోడీ దగ్గర ఎవ్వరు లేరు.

బీజేపీకి మన అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదా అడగలేమని చెప్పి అప్పుడు తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి వచ్చింది. ఇప్పుడైన జగన్ అడుగుతారా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నిక
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడు వైసీపీ అవసరం అవసరం తప్పకుండ ఉందని వైసీపీ నాయకులే చెప్తున్నారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఒక రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టడానికి తీవ్రంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వైసీపీ అవసరం బీజేపీకి చాల ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోలవరం ప్రాజెక్ట్ గురించి, ప్రత్యేక హోదా గురించి బీజేపీతో చర్చించి, ఆ విషయాలను సాధించాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ బీజేపీకి ఎన్నోసార్లు మద్దతు ప్రకటించింది.అయితే అప్పుడు రాష్ట్రం కోసం ఒక్క మాట కూడా బీజేపీని అడగలేదు. ఈసారైనా అడుగుతుందో లేదో చూడాలి.
జగన్ కు దమ్ముందా!!
బీజేపీని అడగటానికి వైసీపీకి అవకాశం వచ్చినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడగలేడని, బీజేపీకి ఎదురుతిరిగి పోరాడే సత్తా జగన్ కు లేదని ప్రతిపక్షాల నేతలు అంటున్నారు. ఒకవేళ జగన్ ఇప్పుడు బీజేపీని ప్రత్యేక హోదా గురించి అడిగినా లేదా బీజేపీకి ఎదురుతిరిగిన సిబిఐని జగన్ ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే జగన్ బీజేపీకి సేవకుడిలా ఉంది తనను తానూ కాపాడుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.