Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతిపక్షాలన్నీ సిఎం జగన్మోహన రెడ్డిని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ కూడా వాళ్ళను అడ్డుకోవడానికి చేయాల్సిన అన్నీ పనులు చేస్తున్నారు. ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడానికే జగన్ జీవో 1 ను అమలోకి తెచ్చారని, ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టులో జీవో1 పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆల్రెడీ హై కోర్టు చర్చలు జరుగుతున్న కారణంగా సుప్రీం కోర్టు ఈ చర్చను మళ్ళీ హై కోర్టు కు బదిలీ చేశారు. అయితే ఇప్పుడు ఈనెల 26 నుండి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని అనుకున్న లోకేష్ కు ప్రభుత్వం ఇప్పుడు జీవోను చూపించి అడ్డంకులు క్రియేట్ చేస్తారేమోనని టిడిపి నాయకులు అనుకుంటున్నారు. అయితే వైసీపీ అన్నీ అడ్డంకులు తీసుకువచ్చినా కూడా పాదయాత్రను ప్రారంభించడానికి లోకేష్ సిద్ధమయ్యారు. అలాగే ఈనెల 27న వారాహి యాత్రను జనసేన అధినేత అయితే వీళ్ళను అడ్డుకోవడానికి జగన్ మళ్ళీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తారో వేచి చూడాలి.
లోకేష్ ను అడ్డుకోగలరా!!
ఈనెల 26 నుండి యువగళం పాదయాత్రను రాష్ట్రంలో ప్రారంభించడానికి టిడిపి నాయకులు వ్యూహాలు రచించారు. ఈ పాదయాత్ర మొత్తం 400 రోజులపాటు, 4 వేల కీలోమీటర్స్ కొనసాగనుంది. అయితే ఇప్పటికీ ఈ పాదయాత్ర కోసం అనుమతి కావాలని
టిడిపి నేతలు ఇప్పటికే డీజీపీకి లేఖలు రాశారు. కానీ అనుమతిలు ఇంకా అధికారులు ఇవ్వలేదు. పాదయాత్రకు అనుమతి తీసుకునేందుకు టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. చిత్తూరు ఎస్పీకి, ఇతర పోలీసు అధికారులకు కూడా లేఖ రాశారు. అయితే వారి నుంచి ఇంతవరకు స్పందన రాలేదని వర్ల చెప్పారు. అయితే అనుమతులు వచ్చినా, రాకున్నా కూడా యాత్రను ప్రారంభిస్తామని టిడిపి నాయకులు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు కావాలనే క్రియేట్ చేసే ఇబ్బందులను ఎలా తిప్పి కొట్టాలో తమకు తెలుసని, వాటికి సిద్ధంగా ఉన్నామని టిడిపి వాళ్ళు చెప్తున్నారు.
వారహికి అనుమతులు వస్తాయా!!
జనసేన అధినేత తన యాత్ర కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేసుకున్నారు. దాని రిజిస్ట్రేషన్ ను తెలంగాణాలో చేయించారు. అయితే ఈ వాహనం ప్రత్యేకంగా చేసుకున్న వాహనం కాబట్టి ఏపీలో తిరగడానికి ఇక్కడి ప్రభుత్వం నుండి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేదన్న విషయాన్నీ వైసీపీ నాయకులు ఎప్పుడో చెప్పారు కాబట్టి ఈ వాహనానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. పవన్ కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా కూడా వారహిని ఏపీకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. లోకేష్ కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే, కోర్టు నుండి అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.