Kodali Nani:ఈ మధ్యకాలంలో వైసీపీ-బీజేపీ మధ్య చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్న బీజేపీ నాయకులు వైసీపీ ఇజ్జత్ తీసి వెళ్తున్నారు. రాష్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో కేంద్రం వాటా ఉన్నప్పటికీ పథకాల ప్రచార పోస్టర్స్ లో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు వచ్చి ఇలా అనడంతో వైసీపీ ప్రభుత్వంతో ప్రతిపక్షాల నేతలు జోకులు వేస్తున్నారు. దింతో హర్ట్ అయ్యిన జగన్ ఇప్పుడు బీజేపీపై వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహానికి కొడాలి నానిని వాడుకుంటూ బీజేపీ కీలక నేత పురంధేశ్వరిపై ప్రయోగిస్తున్నారు. దింతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఒక్కసారిగా పురందేశ్వరి తెరపైకి వచ్చారు. అయితే కొడాలి పురందేశ్వరిపై చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
పురందేశ్వరికి సంబంధం లేదు
బీజేపీలో ఎవరినో అంటే సరిపోదని భావించిన వైసీపీ నేతలు ఏకంగా అన్నగారి కూతురైన పురంధేశ్వరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటి నుండో ఎన్టీఆర్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానితో పురందేశ్వరిని తిట్టిస్తున్నారు. గుడివాడలో కేంద్ర నిధులతో నిర్మించాలనుకుంటున్న రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపిస్తున్నారు. నిజానికి పురందేశ్వరికి గుడివాడ ఫ్లైఓవర్లకు ఎలాంటి సంబంధం లేదు. కనీసం ఆమె గుడివాడ నియోజకవర్గ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టలేదు. కనీసం కేంద్రంలో కూడా ఎలాంటి పదవిలో లేరు. కేవలం బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. ఇలాంటి నేతపై వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఏంటని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై ఓవర్ ను అడ్డుకునేందుకే పురందేశ్వరి ఢిల్లీ వెళ్తున్నారని నాని ఆరోపిస్తున్నారు.
కక్ష రాజకీయాలేనా!!
మొన్న రాష్ట్రానికి వచ్చి బీజేపీ నేతలు వైసీపీని తిట్టడంతోనే ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులపై ఇలా ఆధారం లేని దాడులు చేస్తున్నారు. వైసీపీకి ఎప్పటి నుండో ఈ కక్షపూరిత రాజకీయాలు చెయ్యడం అలవాటే ఇప్పుడు అదే పంథాలోనే పురంధేశ్వరిపై నానితో వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఎలాంటి అధరాలు లేకుండా ఇలా వ్యాఖ్యానించడం ఏంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.