PAWAN KALYAN: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా బీజేపీ ఉందని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ పార్టీని ఎవ్వడు పట్టించుకోడు. కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రావు. అలాంటి పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి పవన్ పొత్తు పెట్టుకున్నాడో ఆయనకే తెలియాలి. ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ లేని బీజేపీతో ఉండటం ఎందుకని ఇప్పుడు పవన్ కు అనిపించిందేమో కానీ ఆ పార్టీని దూరం పెట్టడానికి సిద్ధమయ్యారు. గత కొన్ని రోజుల నుండి పవన్ ప్రవర్తన చూస్తుంటే బీజేపీకి వీలైనంత దూరంగా ఉంటున్నారు. దానికి బీజేపీ వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉండటమే కారణమని జనసేన నాయకులు చెప్తున్నారు.

వైసీపీకి వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే బీజేపీ నాయకులు మాత్రం వైసీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ-వైసీపీ ఒక్కటేనా!!
రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న నీచమైన పాలనపై పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు నిత్యం పోరాడుతున్నారు. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం పరోక్షంగా వైసీపీకి కొమ్ము కాస్తుంది. ఇలా బీజేపీ వైసీపీతో ఉండటం వల్ల తమకు రానున్న రోజుల్లో నష్టం కలిగే అవకాశం ఉందని, అలాగే బీజేపీ వైసీపీ ఒక్కటేనని భావించిన జనసేన నాయకులు బీజేపీని దూరం పెడుతున్నారు. అందుకే ఆత్మకూరు ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ జనసేన మద్దతు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా ప్రకటించారు. అలాగే కొద్దీ రోజుల్లో రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డాను కూడా తాను కలవడం లేదని పవన్ వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ తో పవన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టే అనిపిస్తుంది.
పవన్ ను తగ్గించడానికేనా!!
రాష్ట్రంలో బీజేపీకి ఎంతో అంతో ప్రజలలో ఆదరణ ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ జనసేన వల్లే. అయినా కూడా బీజేపీ నాయకులు నిత్యం పవన్ కళ్యాణ్ ను అవమానించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు రాష్ట్రానికి జేపీ నడ్డా వస్తున్నప్పటికీ జనసేనకు మాత్రం బీజేపీ నాయకులు సమాచారం ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ యే తమ సీఎం అని ప్రకటించిన బీజేపీ నాయకులు ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు .