PAWAN KALYAN: ఎవరన్నా రాజకీయాల్లో వచ్చేది తానూ అధికారంలోకి రావాలని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వేరే వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీని ఓడించి, ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేస్తామని పవన్ ఎప్పుడో చెప్పారు కానీ అప్పుడు పొత్తుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒంటరిగా వెళ్లే ధైర్యం లేని పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ పొత్తుల విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు. తన ముందు ఉన్న ఆప్షన్స్ ను ప్రజలకు, జనసేన కార్యవర్గానికి వివరించే ప్రయత్నం చేశారు.

బీజేపీ,టీడీపీలతో పొత్తులకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మీడియాకు, రాజకీయ పార్టీలకు స్పష్టత ఇచ్చారు. పవన్ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కంటే కూడా వైసీపీని ఓడించి ఇంటికి పంపాలన్న కోరికే బలంగా ఉంది.
పొత్తుల ఒప్షన్స్
ఎప్పటి నుండి వైసీపీ జనసేనపై చేస్తూ వస్తున్న వ్యాఖ్యలను నిజం చేసే దిశగానే పవన్ పొత్తుల రాజకీయం ఉండనుంది. పొత్తుల విషయంలో పవన్ చెప్పిన ఆప్షన్స్ ఏంటంటే ఒకటి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చెయ్యడం, రెండవది టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగడం, మూడవది ఒంటరిగా పోటీ చెయ్యడం. ఈ మూడు విషయాలు చెప్తూ, ప్రతిసారి తాము తగ్గామని, ఈసారి చంద్రబాబు నాయుడు తగ్గాలని వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పకుండా ఈ దొంగతిరుగుడు ఎందుకో అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.
ఒంటరిగా వచ్చే ధైర్యం లేదా!!
పవన్ కళ్యాణ్ నిజంగా తానూ సీఎం అవ్వడానికి రాలేదు, వేరే వాళ్ళనుసీఎం చెయ్యడానికి వచ్చాడని ఈ విషయంతో స్పష్టం అయ్యింది. అధికారం కోసం కాదు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్ కు పొత్తులతో పని ఏముంది. సొంతగా ఎన్నికల్లో పోటీ చేసి , తన బలాన్ని మెల్ల మెల్లగా పెంచుకుంటే సరిపోతుంది కానీ పవన్ అలా చెయ్యరు. టీడీపీ జనసేన కలవాలని టీడీపీ, జనసేన కంటే కూడా ఎక్కువగా వైసీపీని కోరుకుంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీ వీళ్ళను బుచిగా చూపిస్తే మళ్ళీ ఎన్నికల్లో ఒంటరిగా వచ్చామని సింపతితో గెలవడానికి వైసీపీ సిద్ధమైంది. ఎలాగైనా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చెయ్యలేని పవన్ ఎప్పటికి సీఎం కాలేరు అలాగే టీడీపీ జనసేన కలయిక వల్ల వైసీపీకే లాభం.