KCR: కేసీఆర్ ఎక్కడా దొరుకుతాడా అని తెలంగాణ బీజేపీ నాయకులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా కేసీఆర్ బీజేపీ వాళ్లకు దొరికాడు. బీజేపీ దగ్గర అధరాలు ఉన్నాయో లేదో ఎవ్వరికి తెలియదు కానీ కేసీఆర్ తెలంగాణ ఆస్తులను బీజేపీకి దానం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలు దొరికితే కేసీఆర్ ను బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటారు.
సీఎం కేసీఆర్ రూ. 4వేల కోట్ల తెలంగాణ ఆస్తులను తోటా చంద్రశేఖర్ అనే కాంట్రాక్టర్ కు కట్టబెడుతున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. తోట చంద్రశేఖర్ తో బీఆర్ఎస్ సభకు ఖర్చు పెట్టిస్తున్న వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరుగుతోందని ఆయన ఆరోపించారు. మియాపూర్ భూములను బీఆర్ఎస్ ఆంధ్ర అధ్యక్షుడికి ఎలా కట్టబెట్టడుతున్నారని నిలదీశారు.

బీజేపీ నిరూపించగలదా!!

మొన్నటి వరకు మై హోమ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో కేసీఆర్ కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తోటా చంద్రశేఖర్ విషయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే బీఆర్ఎస్ పై బీజేపీ నాయకులు ఇన్నిఆరోపణలు చేస్తున్నారు కానీ వాటిలో కనీసం ఒక్క దాన్ని కూడా నిరూపించడం లేదు. కేసీఆర్ ఇలాంటి అధరాలు లేని ఆరోపణలతో దెబ్బకొట్టడం అంత ఈజీ కాదు. బీజేపీని మొన్న రెడ్ హ్యాండెడ్ గా మీడియాకు పట్టించాడు. అలా ఒక్కసారైనా బీజేపీ కరెక్ట్ ప్రూఫ్ తో ప్రజల ముందు నిలబెడితే ప్రజలకు నమ్మకం వస్తుంది. ఈడీ, సిబిఐలను ప్రత్యర్థుల మీదకు ఉపయోగించడం కేసీఆర్ కూడా బాగా అలవాటు. వాటిని కేసీఆర్ పై కూడా వాడి, ఎందుకు నిరూపించడం లేదో ఎవ్వరికి అర్థం కావడం. అయితే వాటికి అధరాలు లేవని, రాజకీయం చెయ్యడానికే ఇలాంటి చీప్ కామెంట్స్ బీజేపీ వాళ్ళు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

కేసీఆర్ సమాధానం చెప్పాడా!!

కేసీఆర్ మీద బీజేపీ ఎప్పటి నుండో ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. మై హోమ్ విషయంలో ఎలాగో చెప్పలేదు, కనీసం ఇప్పుడైనా కేసీఆర్ బీజేపీ వాళ్లకు సరైన సమాధానం చెప్తాడో లేదో చూడాలి. పైగా ఇప్పుడు జాతీయ రాజకీయలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు పార్టీకి మంచిది కాదు కాబట్టి ఖమ్మం సభలో అయినా వీటిపైనా కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. జాతీయ పార్టీగా మారిన తరువాత కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ ను వాడాకోవడానికి దూరం అయ్యాడు. అందుకే ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను వాడుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మనోభావాలను, మత విద్వేషాలను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చెయ్యడం బీజేపీకి కొత్తేమి కాదు, అలాంటి వాళ్లకు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడంతో మంచి ఛాన్స్ దొరికింది.