KCR: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న మొదటి సభ ఇదే. అందుకే ఈసభతో జాతీయ స్థాయిలో ముద్ర వెయ్యడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్, ఇప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టి, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చెయ్యడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసభకు ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని, వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతులు తెలిపే నాయకులు ఇక్కడికి వస్తున్నారు. ఈసభను దాదాపు 100 ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈసభను ఎలాగైనా విజయవంతం చెయ్యాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈసభకు దాదాపు 5 లక్షలమంది జనం వచ్చే అవకాశం ఉంది.

ఎవరెవరు వస్తున్నారు!!

ఈసభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళా ముఖ్యమంత్రి విజయన్ ఈ సభకు వస్తున్నారు. ఈ నాయకులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అలాగే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు, బీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖులు తరలి వస్తున్నారు. సభ వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 140 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది అతిథులు కూర్చునేలా వేదిక ఏర్పాటు చేశారు. ఖమ్మంతో పాటు రహదారులన్నీ గులాబీమయమయ్యాయి.

యాదగిరి గుట్టకు సీఎంలు

అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్ లను కేసీఆర్ యాదగిరి గుట్టకు తీసుకెళ్లనున్నారు. అక్కిడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన తరువాతే ఖమ్మం సభకు బయలుదేరనున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత కంటి వెలుగు కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొననున్నారు. ఇక్కడే వచ్చే ఎన్నికల్లో తానూ అనుసరించనున్న వ్యూహాలను కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ మెచ్చుకున్నారు. అలాగే ఈసభలోనే బీఆర్ఎస్ లో తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీని విలీనం చెయ్యనున్నారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఎలా అడ్డుకోవాలో ఇక్కడి నుండే వ్యూహాలు రచించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈసభ జరుగుతున్న సమయంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు.