Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చాలా వ్యూహాలు రచిస్తున్నారు. వాటిలో భాగంగానే యువతను టార్గెట్ చెయ్యడానికి పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు యువగళం అనే పేరును పెట్టారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే యువతను టార్గెట్ చేస్తూ యువభేరిలను నిర్వహిచారు. ఇప్పుడు నారాలోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ, ఈ కార్యక్రమానికి టీడీపీ ఇప్పుడు శ్రీకారం చుట్టిందని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీకి ఈ యువభేరీలు చాలా హెల్ప్ అయ్యాయి, విభజన హామీలను సాధించడంలో టీడీపీ ఎలా విఫలమైందో చెప్తూ, తనకు ఒక్క అవకాశం ఇవ్వమని జగన్ కోరారు. ఇప్పుడు లోకేష్ కూడా జగన్ నే ఫాలో అవుతూ తమకు ఒక్క అవకాశం ఇవ్వమని అడగటానికి పాదయాత్ర ప్లాన్ చేశాడు.
యువతే టార్గెట్
యువత ఓటు ఎన్నికల్లో ఎంత ఇంపార్టెంటో అందరికి. వాళ్ళను పట్టుకోగలిగితే వారి ఓట్లతో పాటు, వాళ్ళ పేరెంట్స్ ఓట్లు కూడా కొంతవరకు సాధించినట్టే. అందుకే ఇప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ యువత మద్దతు పొందటానికి చూస్తున్నారు. గతంలో జగన్ ఇండోర్ లలో మీటింగ్ పెట్టి యువత మద్దతును పొందటానికి ప్రయత్నించారు కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం బహిరంగ సభలు పెడ్తూ యువతకు వైసీపీ ప్రభుత్వం చేస్తునం మోసాన్ని వివరించనున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ విషయాన్నీ పట్టించుకోకుండా ఉన్న జగన్ యొక్క అసమర్థ పాలన గురించి చెప్పడానికి లోకేష్ ప్లాన్ చేశారు. 400 రోజుల్లో 4000 కిలోమీటర్స్ పాదయాత్ర చేస్తూ చేస్తారు.
లోకేష్ ను నమ్ముతారా!!
చంద్రబాబు నాయుడు కొడుకుగా తప్పా లోకేష్ తనకంటూ రాజకీయాల్లో తెచ్చుకున్న గుర్తింపు అంటూ ఏమి లేదు. గత ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. పైగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయ్యారు. అలాంటి అసమర్థ లోకేష్ ను యువత నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఇప్పుడు ప్రశ్న. గతంలో జగన్ సొంతంగా పార్టీ పెట్టి, టీడీపీ పెడుతున్న ఎన్నో ఇబ్బందులను సొంతంగా ఎదురుకొన్నారు కాబట్టి యువత ఆయన పక్షాన నిలబడింది. పైగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చెయ్యకుండా ఇప్పుడు వైసీపీని విమర్శిస్తుంటే యువత ఎలా స్పందిస్తారో చూడాలి.