pawan-kalayan-junior-artist-said-that-his-daughter-is-getting-married-do-you-know-what-pawan-kalyan-help
pawan-kalayan-junior-artist-said-that-his-daughter-is-getting-married-do-you-know-what-pawan-kalyan-help

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందే రాజకీయంగా వాడుకోవడానికి, ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారనుంది. మూడు రాజధానులు వద్దని టీడీపీ-జనసేన వాళ్ళు అంటుంటే, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మూడు రాజధానుల అంశమే కరెక్ట్ అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మొన్న శ్రీకాకుళంలో యువశక్తి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ అమరావతినే రాజధానిగా చెయ్యాలనే భావంతో మాట్లాడారు. ఈ మాటలను ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు పడుతున్నారు. ఇక్కడికి వచ్చి, ఇక్కడి ప్రజలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. అయితే వైసీపీలో మొన్నటివరకు ప్రతిఒక్కరు మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడేవారు కానీ ఇప్పుడు కేవలం మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మాత్రమే మాట్లాడుతున్నారు. వైజాగ్ ను రాజధానిగా చెయ్యకపోతే, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలని కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు.

అభివృద్ధి పవన్ కు ఇష్టం లేదా!!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని వికేంద్రీకరణ చెయ్యాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశానికి శ్రీకారం చుట్టారని ధర్మాన తెలిపారు. అయితే మూడు రాజధానుల అంశం ద్వారా ఉత్తరాంద్రకు మంచి జరుగుతుందని, ఎప్పటి నుండి వెనకబడ్డ ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రకు ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయని, అయితే టీడీపీకి తొత్తులా పని చేస్తున్నజనసేనకు ఇదంతా ఇష్టం లేదని, అందుకే మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల బుక్స్ చదివానని చెప్పుకునే పవన్ కు వాటిలో ఉన్న సారాన్ని మాత్రం అర్థం చేసుకోలేదని, శ్రీశ్రీ చెప్పిన సమసమాజాన్ని స్థాపించడానికి జగన్ కృషి చేస్తున్నారని ధర్మాన చెప్పారు. ఉద్ధానం అభివృద్ధికి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టులను చేపట్టామని ధర్మాన అన్నారు.

రాజధానే ఎన్నికల వ్యూహమా!!

రాష్ట్రం విడిపోయి ఇప్పటికి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ చేతకాని రాజకీయల వల్ల ఇంకా రాష్ట్రానికి రాజధాని పేరు కూడా డిసైడ్ కాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి, ఇదే రాజధనని మోసం చేశాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అసలు రాజధాని అనే అంశాన్నే ఒక రాజకీయ అస్త్రంగా మార్చారు. అమరావతిని రాజధానిగా చెయ్యాలని టీడీపీ వాళ్ళు, మూడు రాజధానులని వైసీపీ వాళ్ళు క్రెడిట్ కోసం పాకులాడుకుంటూ, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కనీసం ఒక్కరూపాయి కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చెయ్యలేదు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశాన్ని రెండు పార్టీలు వాడుకుంటూ ఎన్నికలకు వెళ్తారు. ఈ రాజధాని అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ లా ఎప్పటికి తేల్చకుండా ఎన్నికల కోసం వాడుకుంటూ ఉంటారు. ఈ పనికిమాలిన రాజకీయ నాయకుల వల్ల ఎవ్వరికీ లాభం లేదు.