Pawan Kalyan: జనసేన పార్టీకి ఇప్పుడు ఏపీలో ఉన్నంత డిమాండ్ దాదాపు ఏపార్టీకి లేదు. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క సీట్ కూడా ఎన్నికల్లో గెలవలేదు. కనీసం సర్పంచ్ కూడా లేరు.అయినా కూడా వైసీపీ, టీడీపీ పార్టీలు నిత్యం పవన్ కళ్యాణ్ పేరును స్మరిస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తు ఆల్మోస్ట్ ఫిక్స్ అవ్వడంతో వైసీపీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ మంత్రి పవన్ పై ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ పోలాండ్ కు 1800 కోట్ల రూపాయలను హవాలా చేస్తూ కేంద్రానికి దొరికిపోయాడని, వాళ్ళే పవన్ కళ్యాణ్ ను కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
పవన్ హవాలా చేశాడా!!
పవన్ కళ్యాణ్ కు హవాలా చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తానూ మూవీస్ చేసుకున్నా చాల పైసల్ వస్తాయి. ప్రజల కోసమే వాటినే త్యాగం చేసి, రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ హవాలా చేసే ఛాన్స్ లేదు. అయినా అన్ని పైసల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇచ్చేవారు ఎవరున్నారు. అయినా ఎన్నికల సమయంలో ఇలా ఏ నాయకుడు కూడా చెయ్యరు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ ఆల్రెడీ పొత్తును తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అక్కడే హవాలా చేస్తూ దొరికి ఉంటే, బీజేపీ పవన్ ను ఇష్టమొచ్చినట్టు తమ పార్టీ కోసం వాడుకునేది. తానూ ఏ తప్పు చెయ్యలేదు కాబట్టే ధైర్యంగా బీజేపీతో పొత్తు నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ చీప్ పాలిటిక్స్
వైసీపీ నాయకులు ఎంత చీప్ గా మాట్లాడుతారో అందరికి తెలుసు. అధికారంలో ఉన్నా కాబట్టి ఏమి మాట్లాడినా చెల్లుతుందన్న భావనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు, కాబట్టి ఆ పొత్తు కోసం పవన్ ప్యాకేజీ తీసుకున్నారని వైసీపీ ఎప్పటి నుండో ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ ఆరోపణకు మరింత ఊతం చేకూర్చడానికి ఈ హవాలా వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. టీడీపీ- జనసేన పొత్తును చూసి వైసీపీ భయపడుతున్నందు ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నారని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ తనను ఎవరన్నా ప్యాకేజీ తీసుకున్నాడని అంటే చెప్పు తీసుకోని కొడుతా అని అన్నా కూడా వైసీపీ వాళ్లకు సిగ్గు రావడం లేదు.