pawan kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ చాల విషయాలు నేర్చుకున్నారు. పార్టీ పెట్టినప్పటికీ సిద్ధాంతాలను మార్చుకుంటూ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఈ పది సంవత్సరాల రాజకీయ ప్రయాణలో పవన్ కళ్యాణ్ చాల విషయాలు నేర్చుకున్నారు. మొదట్లో కులాలకు, మతాలకు దూరంగా ఉండాలని అనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం కుల రాజకీయాలు మాత్రమే చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు గతంలో వీటికి దూరంగా ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో ఓడిపోయాడు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ కులాలకు, మతాలకు దూరంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని తెల్సుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటితో మాత్రమే రాజకీయం చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.

కాపు లీడర్ గా మారనున్నాడా!!

గతంలో అసలు కులం గురించి అస్సలు మాట్లాడేవాడుకాదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఏ రాజకీయ నాయకుడు కూడా కులం గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. ప్రతి సభలో కులం మాట లేకుండా ప్రసంగం చెయ్యడం లేదు. మాట్లాడితే కాపు వాళ్ళు నన్ను ఓన్ చేసుకోవడం లేదని, కాపు వాళ్ళు నన్ను లీడర్ గా చూడటం లేదని కులప్రస్తావన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు తనకే మద్దతు ఇవ్వాలని, కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తూ, SC, ST, BCలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని, ఇలా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో కాపులకు అధికారం దక్కుంతుందని పవన్ కళ్యాన్క్ చెప్తున్నాడు. ఈరోజు మచిలీపట్నంలో జరిగే 10వ ఆవిర్భావ సభతో పూర్తిగా కాపు నాయకుడిగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా కేవలం ఒక్క కులానికే పరిమితం కావాలని అనుకోరు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కాపు వాళ్ళను ఉద్ధరిస్తూ, కేవలం వాళ్ళకే నాయకుడు కావాలని అనుకుంటున్నారు.

డబ్బులు కూడా పంచుతాడా!!

తానూ రాజకీయాల్లోకి వచ్చిందే కొత్త రాజకీయాలు చెయ్యడానికని పవన్ కళ్యాణ్ మొదట్లో నిత్యం చెప్పేవారు కానీ ఈమధ్య పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ చెప్పడం లేదు. ఎందుకంటే అతను అందరిలానే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చెయ్యడానికి సిద్ధమయ్యారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో పవన్ ఓడిపోయినా కూడా అస్సలు డబ్బులు పంచలేదనే ప్రశంసను పొందుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో డబ్బులు కూడా పంచడం స్టార్ట్చ్ చేస్తాడేమో చూడాలి. ఐన ఎలాగో వచ్చే ఎన్నికల్లో బాబుతో పొత్తు పెట్టుకోనున్నాడు కాబట్టి ఎలాగైనా డబ్బులు పంచే కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ తేరలేపే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకెంత దిగజారుతాడో చూడాలి.