PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. పోయిన ఎన్నికల్లోనే రెండు స్థానంలో పోటీ చేస్తే కనీసం ఒక్కస్థానంలో కూడా గెలవలేదు. పోయింది. ఈసారి కూడా వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఇక పార్టీ ఉండి కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పటి నుండి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చెయ్యాలన్న దానిపై జనసేన నాయకులు చర్చలు ప్రారంభించారు.

అయితే గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరంలో మళ్ళీ పోటీ చేస్తే గతంలో వచ్చిన రిజల్ట్ యే వచ్చే అవకాశం ఉందని అందుకే అక్కడి నుండి మళ్ళీ పోటీ చెయ్యకూడదని జనసేన పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
తిరుపతి నుండా!!
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుండి పోటీ చేయనున్నారని జనసేన వర్గాల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి అక్కడి నుండే పోటీ చేసి గెలిచారని, అలాగే అక్కడ పవన్ ను అభిమానించే వాళ్ళు, అలాగే పవన్ కు సంబంధించిన కులానికి చెందిన వారు అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడి నుండి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే జనసేన తిరుపతి నాయకులు కూడా పవన్ ను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుండే పోటీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో జనసేన నాయకుల హాడావిడీ కూడా ఎక్కువైంది. ఎలాగైనా పవన్ ను ఇక్కడి నుండి పోటీ చేయించి, గెలిపించి, అసెంబ్లీకి పంపాలని జనసేన నాయకులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కూడా కుల రాజకీయమా!!
సమాజంలో మార్పు కోసం తానూ రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ నిత్యం చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ఏమాత్రం పాటించారు. ఎందుకంటే మార్పు అంటూ రాజకీయాల్లోకి వచ్చినా వ్యక్తి కూడా మిగితా నాయకుల్లా తన కులం ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారని చూసి ఎన్నికల్లో పోటీకి దిగితే ఇంకా పవన్ కు మిగితా నాయకులకు తేడా ఏముంటదని సామాన్య ప్రజలు కూడా జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నారు. మార్పు కోసం వచ్చానని చెప్పే పవన్ ఆ మార్పు దిశగా అడుగులు వేస్తె ఇంకా బాగుంటది.