Pawan Kalyan: జనసేన 10వ ఆవిర్భావ వేడుకలు ఇవ్వాళా మచిలీపట్నం చాల ఘనంగా జరుగుతున్నాయి. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారనుంది. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం అసాధ్యం కానీ తానూ ఎవరికైనా మద్దతు ఇస్తే వాళ్ళు మాత్రం అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలో చాలా చోట్ల టీడీపీ ఓడిపోవడానికి జనసేననే కారణం. అందుకే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పవన్ ఎటు వైపు నిల్చుంటాడు అనే విషయంపై రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు.

పొత్తు గురించి చెప్తాడా!!
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఓడించాలని పవన్ కళ్యాణ్ చాల గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ విషయాన్ని టీడీపీ కానీ జనసేన కానీ అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఇక ఇప్పుడైనా ఆ పొత్తు గురించి రెండు పార్టీలు క్లారిటీ ఇస్తే రెండు పార్టీల నాయకులకు ప్రజల మధ్యకు వెళ్ళడానికి ఒక క్లారిటీ ఉంటది. కానీ రెండు పార్టీలు కార్యకర్తలకు ఆ క్లారిటీ మాత్రం ఇవ్వడకుండా వాళ్ళను ఇంకా కన్ఫ్యుస్ చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఈ వేడుకల్లోనైనా పవన్ కళ్యాణ్ ఈ పొత్తు విషయమై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.
భారీ ఎత్తున ప్రజలు
ఈ ఆవిర్భావ వేడుకలకు ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులోని ఆటోనగర్ బస్ టెర్మినల్ నుంచి మొదలైన వారాహి విజయయాత్ర.. అడుగులో అడుగు వేస్తూ సాగింది. అభిమానులు పోటెత్తడంతో వారాహి వాహనం ముందుకు కదలడం కష్టంగా మారింది. అభిమానులు జయజయ ధ్వానాలు పలుకుతూ పెద్దఎత్తున వారాహిని అనుసరించారు. ఆటోనగర్ టెర్మినల్ నుంచి పప్పుల మిల్లు సెంటర్, కానూరు కామయ్య తోపు సెంటర్, తాడిగడప సెంటర్, పోరంకి సెంటర్, పెనమలూరు సెంటర్ మీదుగా వారాహి యాత్ర సాగుతోంది. అయితే ఇక్కడికి వచ్చిన జనసైనికులకు మచిలీపట్నం జనసేన నాయకులు దాదాపు 5000ల పులిహోర పొట్లాలను ఇవ్వనున్నారు.