Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఐతున్నా కూడా ఇంకా రాజకీయంగా అతనికి దేనిమీద ఇంకా స్పష్టత లేదు. ఎప్పుడు దేనిమీద ఒక స్పష్టమైన, స్థిరమైన నిర్ణయాలు ఉండవు. ఇష్టమొచ్చినప్పుడల్లా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు. మొన్నటి వరకు బీజేపీ వెనకాల తిరిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ వెనకాల తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న మద్దతు గురించి, పవన్ కళ్యాణ్ కంటే కూడా వేరే పార్టీల నాయకులకే ఎక్కువ తెలుసు. అందుకే వాళ్ళు పవన్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్లాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ వైపు ఉన్న పవన్ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్లే సాహసం ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు.

ఇప్పటి వరకు బీజేపీతో నడిచిన పవన్ కు వైసీపీ నుండి వస్తున్న కొన్ని ఇబ్బందుల నుండి తప్పించగలిగింది కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ కు మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే నేరుగా బీజేపీకి శత్రువుగా మారినట్టే. అయితే ఎన్నికలకు దగ్గరికి వస్తున్న వేళ పవన్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారడం వల్ల కేసీఆర్ ఏపీలో కూడా పోటీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అక్కడ జనసేన మద్దతు కేసీఆర్ కోరుతున్నట్టు, దానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టే ఉన్నాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే పవన్ ఇలా చెయ్యడం వల్ల అతనికే నష్టమని, వైసీపీ చేసే ఆగడాలను అడ్డుకోవడానికి బీజేపీ సపోర్ట్ ఉంటేనే మంచిది.
తెలంగాణాలో పోటీ చేస్తాడా!!
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గౌరవప్రదమైన స్థానాల్లో గెలిచి, అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తాడా లేకా తానే నేరుగా పోటీకి దిగుతాడా అన్నది ఇంకా తేలడం లేదు. పైగా నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తెలిపారు. అలాగే చాలా సందర్భాల్లో కేసీఆర్ పై ప్రశంశల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలో ఒకవేళ పవన్ కేసీఆర్ పక్షాన నిలబడితే మాత్రం కేసీఆర్ కు చాలా బలం చేకూరినట్టే. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ను తెలంగాణలో ఓడించటానికి చాల పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్ మాత్రం ఒక్కడే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సమయానికి పవన్ కేసీఆర్ పక్షాన ఉంటారో లేదో వేచి చూడాలి.