Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తానూ పార్టీ పెట్టినప్పటి నుండి మూవీస్ కు దూరంగా ఉండి ప్రజాసేవకే తానూ కట్టుబడి ఉంటానని చాలాసార్లు చెప్పారు కానీ చెప్పిన మాట మీద ఎప్పుడూ నిలబడలేదు. ఎప్పటికప్పుడు చెప్పిన మాటను తుంగలో తొక్కుతున్నారు. మూవీస్ చెయ్యడానికి తనకు వైసీపీ వాళ్ళలా దొంగ వ్యాపారాలు లేవని, వాళ్ళలా నేను ప్రజా సొమ్మను దోచుకోవడం లేదని, పార్టీని నడపటానికి మాత్రమే తానూ మూవీస్ లో నటిస్తున్నానని పవన్ చెప్తున్నారు కానీ ఈ విషయాన్ని ప్రత్యర్థులు కానీ ప్రజలు కానీ కన్విన్స్ అయ్యేలా మాత్రం లేదు. ఇప్పుడు ఇదే విషయాన్నీ వైసీపీ నాయకులు ప్రజలకు చెప్తూ పవన్ యొక్క అంకితభావాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై మంత్రి రోజా పవన్ పై చాలా పదునైన విమర్శలు చేశారు. పవన్ చేస్తున్న వీకెండ్ రాజకీయాలు ప్రజలకు తెలుసని, ఆయన చిత్తశుద్ధి కూడా ప్రజలకు తెలుసని రోజా వ్యాఖ్యానించారు.
ప్రజలే చెప్పులు చూపిస్తారు
చంద్రబాబు నాయుడు యొక్క భావాలను, అయన సిద్ధాంతాలను, టీడీపీని అధికారంలోకి తీసుకొనిరావడానికి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, హీరోలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని అనుకోవడం మూర్ఖత్వమని, చిరంజీవిని చూసి కూడా పవన్ ఎలా రాజకీయాల్లోకి వచ్చాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీకెండ్ రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఇలా ఇష్టమొచ్చినట్టు వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తూ, చెప్పులు చూపిస్తే రానున్న రోజుల్లో పవన్ కు కూడా ప్రజలు చెప్పులు చూపిస్తారని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చెయ్యని వైసీపీ నాయకులను అడ్డ గాడిదలను పవన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైసీపీ నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలను తిప్పి కొడుతూ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
నువ్వే అడ్డగాడిద
ప్రజలకు సేవ చేస్తూ, నిత్యం ప్రజల్లోనే ఉంటున్న తాము అడ్డగాడిదలము కాదని, సొంత పార్టీ కోసం కాకుండా టీడీపీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తున్న నువ్వే అడ్డగాడిదవని పవన్ పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని 2020 నాటికి పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ నాయకులను అడ్డగాడిదలని పవన్ తిట్టడం కరెక్ట్ యే కానీ ఈ ప్రశ్నలు గతంలో తానూ అధికారంలోకి తెచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడును ఎందుకు ప్రశ్నించలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరకు పడుతున్నా కూడా ఇంకా పవన్ ఈ వీకెండ్ రాజకీయాలు చెయ్యడం ఏంటని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్నీ వైసీవ్ గుర్తించింది కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గుర్తించినట్టు లేదు. అందుకే ఇంకా మూవీస్ చేస్తూ సమయాన్ని వృద్దా చేస్తున్నారు.