KCR: మొన్నటి వరకు రాష్ట్రంలో తనకు తిరుగే లేదని అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ల నుండి విపరీతమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలవడంతో రాష్ట్రంలో బీజేపీకి కొత్త బలం వచ్చింది. అప్పటి నుండి కేసీఆర్ బీజేపీ భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత పెరిగింది. అలంటి సందర్భంలో ఇలా ప్రతిపక్షాల నాయకులు బలపడుతుంటే తెరాస నేతలకు నిద్రపట్టడం లేదు. అలాగే కాంగ్రెస్ ను ప్రజల్లో ఇంకా ఆదరణ ఉంది. ఒక ప్రాంతాల్లో కేసీఆర్ కు బీజేపీ అడ్డుపడుతుంటే మరోచోట కాంగ్రెస్ అడ్డుపడుతుంది. ఇలా కేసీఆర్ ప్రతిపక్షాల నుండి తీవ్రమైన పోటీ ఉంది. పైగా ఇప్పుడు రెండు పార్టీల నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించారు. తెరాసలో ఉన్న నాయకులను బయటకు లాగటడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది తెరాసా నేతలకు కేసీఆర్ అంటే పడటం లేదు.

అలంటి నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో కేసీఆర్ తప్పా మరో నాయకుడు లేదని అనుకున్న వారికి ఇప్పుడు చాల ఒప్షన్స్ కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్-బీజేపీ
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేల వల్ల చాలామంది నాయకులకు తెరాసలో టికెట్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో ఆ నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. వారిని బుట్టలో వేసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ ఎదురుచూస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం టిక్కెట్లు ఖరారు చేయాలనుకుంటున్న కేసీఆర్ చాలా మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. అదే సమయంలో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ చాన్స్ లేదన్న సూచనలు కూడా పంపుతున్నారు. పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే లేదని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టిక్కెట్లు లభించే చాన్స్ లేని పాతిక మంది ఎమ్మెల్యేల వరకూ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. వారంతా వెళ్లొచ్చని టీఆర్ఎస్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇలా కిషోర్ వల్ల కేసీఆర్ కు ఎంత ప్రయోజనం ఉందొ తెలియదు కానీ బీజేపీ , కాంగ్రెస్ కు మాత్రం బాగా కలిసి వచ్చింది.
కేసీఆర్ ఊరుకుంటాడా!!
ఇలా తెరాసా నేతలు వెళ్లి ప్రతిపక్షాల పార్టీలో చేరితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని, సమయం వచ్చిన్నప్పుడు తన ప్రభావం చూపిస్తాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ చేస్తున్న ఆపరేషన్ కమల్‌పైనా, కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్న నేతల విషయంలోనూ కేసీఆర్‌కు క్లారిటీ ఉందని సమయం వచ్చినప్పుడు కౌంటర్ స్టార్ట్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూడా బలపడినట్లుగా కనిపిస్తున్నందున పార్టీ నేతలకు ఆప్షన్లు పెరిగాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఆపరేషన్ కమల్ విషయంలో కేసీఆర్ ఓ స్పష్టమైన అవగాహనతో ఉన్నారని ఆయనేమీ ఆందోళన చెందడం లేదని టీఆర్ఎస్ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు. అయిన కేసీఆర్ కాదనుకున్న నాయకులను ఈ పార్టీలు తీసుకోని ఎలా వాడుకుంటాయో చూడాలి.