Rahul Gandhi:తెలంగాణకి రాహుల్ రాక కాంగ్రెస్ లో జోష్ నింపగలదా!!

Arjun

Rahul Gandhi:తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల కృషి ఎంతుందో, దానిలో చాల కొంచెం భాగం కాంగ్రెస్ నాయకుల పాత్ర కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. అయితే ఇలాంటి కాంగ్రెస్ కు ఇప్పుడు రాష్ట్రంలో

is rahul gandhi going to give new energy to telangana congress leaders

చాల గడ్డుకాలం నడుస్తుంది. ప్రజల నుండి కనీస మద్దతుకు నోచుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరిస్తున్న కాంగ్రెస్ మరింత బలహీనపడుతుంది. ఐతే ఇప్పుడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నా కాంగ్రెస్ నాయకుల్లో కొంత ఉత్సహం కనిపిస్తుంది.

రాష్ట్రానికి రాహుల్ కానుక

6వ తేదీన రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కోసం తమ పార్టీ విషయాల గురించి రాహుల్ తో చెప్పించే అవకాశంఉందని, రాహుల్ తో ఒక మినీ మేనిఫెస్టో ను కూడా విడుదల చేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నీరసంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల్లో రాహుల్ గాంధీ ఉత్సహాన్ని నింపుతారో వేచి చూడాలి.

నాయకుల గొడవలు

కాంగ్రెస్ ఓడించడానికి ఎవ్వరు కృషి చెయ్యాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్లలో వాళ్ళకే చాల గొడవలు ఉన్నాయ్. ఈ గొడవలతో కొట్టుకుంటే వాళ్ళే ఓడిపోతారు. రాహుల్ వస్తున్నా నేపథ్యంలో కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య జరుగుతున్నా గొడవల గురించి అందరికి తెలిసిందే. ఈ గొడవల విషయమై రాహులా గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -