Revanth Reddy: వయసుపైపడిన వాళ్లకు చాదస్తం ఎక్కువని అందరూ అంటూ ఉంటారు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. వాళ్లకు పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా లేదు, అలాగే వారికి పార్టీలో ఉన్న వేరే నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకోని రావడానికి రేవంత్ రెడ్డి ఎన్నో ప్లాన్స్ వేస్తున్నారు కానీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మాత్రం దానికి అడ్డుపడుతున్నారు. అడుగడుగునా రేవంత్ రెడ్డికి పార్టీలోని ముసలి నాయకులు అడ్డుపడుతున్నారు. టీడీపీ నుండి వచ్చిన కొద్దిరోజులకే పార్టీ అధ్యక్షుడిగా ఎదగటాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈఅడ్డంకులతో విసిగిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికి సిద్ధమని తానె ప్రకటించారు.
రేవంత్ రాజీనామా!!
పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకోని వచ్చే నాయకుల వెనక ఉండటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, పార్టీ సభ్యుడిగా ఉంటూ, అధ్యక్షుడి పల్లకి మొయ్యడానికి తానూ సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రేవంత్ ఈ రాజీనామా వ్యాఖ్యలు తానూ ఇష్టపూర్వకంగా చెయ్యలేదని, పార్టీలోని సీనియర్ నేతలు అలా చేసేలా చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డిపై పార్టీలోని సీనియర్స్ అందరు కక్షకట్టి మరీ దాడి చేస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డిరాజీనామా చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న ఆ కాస్త ప్రజల మద్దతు కూడా పోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ప్రజలు మర్చిపోతున్నారు, ఇక రేవంత్ రాజీనామా చేస్తే పార్టీ మొత్తం నేలమట్టం అవుతుంది. పార్టీ పెద్దలు ఢిల్లీ నుండి వచ్చి చెప్పినా కూడా సీనియర్ వినకుండా రేవంత్ పై దాడి చేస్తున్నారు.
కాంగ్రెస్ ఉంటుందా!!
తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు కేవలం బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే జరుగుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అంతరించిపోతున్న కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము కొట్టుకోవడానికి చూస్తున్నారు కానీ ఆ రెండు పార్టీల మీద వ్యూహాలు రచించడం లేదు. అసలు ఈ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలకు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కంటే కూడా రేవంత్ ను అధ్యక్ష పదవి నుండి దింపాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పనికిమాలిన సీనియర్ నేతలు వల్ల, పార్టీలో పని చేస్తున్న వారు పని చేయలేకపోతున్నారు. ఈ సీనియర్ నేతల వల్ల పార్టీలో ఉన్న యువ నాయకులు డీలా పడుతున్నారు. ఈ నేతలు ఇంకా మారకపోతే వచ్చే ఎన్నికలో పార్టీకి కనీసం డిపాజిట్స్ కూడా దక్కడం కష్టమే.