Ys Jagan Mohan Reddy:జగన్ ను మళ్ళీ జనసేన-టీడీపీనే గెలిపిస్తాయా!!

Arjun

Ys Jagan Mohan Reddy:2019 ఎన్నికల్లో గెలవడానికి తన వ్యూహాలు ఎంత వరకు సహకరించాయో, అంతే స్థాయిలో టీడీపీపై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి అంతే స్థాయిలో కలిసి వచ్చింది. ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ కూడా జనసేన మరో టిడిపిగా భావించి, కనీసం పవన్ కళ్యాణ్ కు కూడా విజయం ఇవ్వలేదు. ఇలా ఇవన్నీ కలిసి రావడం వల్ల 151 స్థానాల్లో

Ys Jagan Mohan Reddy

వైసీపీ విజయం సాధించింది. ఈ ఘన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో వైసీపీని టీడీపీ-జనసేననే గెలిపించాయి. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీని టీడీపీ-జనసేన నాయకులే గెలిపించనున్నారు.

వైసీపీకి మళ్ళీ అదృష్టం

వైసీపీని టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అడ్డుకోలేకపోయాయి. టీడీపీ ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించిందో వైసీపీకి ప్రజల నుండి అంత ఆదరణ పెరిగింది. అలాగే వైసీపీ ఇన్ని కష్టాల్లో కూడా ఒంటరిగా పోటీకి వస్తున్నాడని కూడా ప్రజల్లో సింపతీ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. మళ్ళీ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాలు సఫలమైతే మళ్ళీ ఈ విషయాన్నీ పట్టుకొని ప్రజల నుండి జగన్ మళ్ళీ సింపతి గైన్ చేసి గెలుస్తాడు.

వైసీపీపై నమ్మకం ఉందా

2019 ఎన్నికల్లో ప్రకటించిన పథకాలలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే చాలా విషయాల్లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వైసీపీకి ప్రజాల్ వ్యతిరేకత పెరిగింది. ఈ వ్యతిరేకతను ఒకవేళ వైసీపీ నాయకులు మళ్ళీ పాజిటివ్ మార్చుకుంటే వైసీపీకి విజయం తధ్యం. అభివృద్ధి కంటే పథకాలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మళ్ళీ కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటే వైసీపీకి విజయం మళ్ళీ వరిస్తుంది.

- Advertisement -