KCR: కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో అనేక విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా అధికారం కోసం ప్రయత్నిస్తున్నా, లేదా తనకు పోటీ వస్తారని అనుకున్నా తెలంగాణను తెచ్చింది తానేనని, దాని కోసం పోరాడింది తన పార్టీనేనని చెప్పుకునే వాడు కానీ ఇప్పుడు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ఆ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కుదరడం లేదు. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు ఈ విషయాన్నీ ఆసరాగా తీసుకోని, తెలంగాణాలో అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కు ఇప్పుడు ప్రాంతీయ భావం తగ్గిందని, అతను, అతని పార్టీ ఇప్పుడు తెలంగాణవి కావని, పరాయి వారని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. ఐన పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న టీడీపీ వాళ్లకు కేసీఆర్ నే పరాయి వాడని అనేంత ధైర్యం ఎక్కడి వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
టీడీపీ ధైర్యం ఎవరు??
ఏపీలో సీరియస్ గా రాజకీయాలు చేస్తున్న టీపీడీకి, ఇక్కడి కేసీఆర్ ను ఇంతలా విమర్శించే ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటే… అందరు చెప్పే ఆన్సర్ మాత్రం బీజేపీ అనే చెప్తున్నారు. సడన్ గా టీడీపీ తెలంగాణాలో రాజకీయాలు చెయ్యడం వెనక బీజేపీ ఉందని, అందుకే ఇప్పుడు టీడీపీలో అంత ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని, ఈ విషయాన్నీ ఎన్నికల ముందు రెండు పార్టీలు ప్రకటించనున్నారు. ఖమ్మంలో జరిగిన సభను చూసి, ఇక్కడ పోటీ చెయ్యడానికి టీడీపీ సిద్ధమైంది. అయినా ఒక్క సభ సక్సెస్ అవ్వడంతోనే పోటీకి దిగడానికి టీడీపీ సిద్ధమవ్వడంపై చాలామంది నవ్వుతున్నారు. ఇక్కడ ఎప్పటి నుండో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నే ఎవ్వరు పట్టించుకోవడం లేదు, ఇప్పుడు ఇక్కడికి టీడీపీ వచ్చి ఏమి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుంది.
బీజేపీకి అంత దమ్ము ఉందా!!
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీట్ కూడా గెలవలేదు. కేవలం రెండు సీట్లను అది కూడా ఉప ఎన్నికల్లో గెలిచింది. ఈ రెండు సీట్లను చూసుకొని, బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తామని కలలు కంటుంది. బీజేపీ కేవలం రెండు, మూడు స్థానాల్లో తప్పా ఎక్కడా కూడా కనీసం బలమైన నాయకులు కూడా లేరు. బండి సంజయ్, అరవింద్, ఈటెల ఈ ముగ్గురు నాయకులు తప్పా మిగితా వాళ్లెవరో కూడా ప్రజలకు తెలియదు. ఇలాంటి పార్టీని చూసుకొని , టీడీపీ ఎగిరెగిరి పడుతుంది. లాస్ట్ టైం పోటీ చెయ్యడానికి వచ్చి కేసీఆర్ ఇచ్చిన షాక్ తో మళ్ళీ మొన్నటి వరకు తెలంగాణ వైపు చూడలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు, కేసీఆర్ ఎదో ఒక షాక్ ఇస్తాడు, ఆ షాక్ మళ్ళీ చచ్చే వరకు తెలంగాణ వైపు రాకపోవచ్చు.