TDP: వంగవీటి రంగాను టీడీపీనే చంపిందనే వార్త ఇప్పటికీ ప్రచారంలో ఉంది. దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వంగవీటి రంగా వారసులు టీడీపీలోనే ఉన్నారు. కాబట్టి రంగాను టీడీపీ చంపలేదనే అర్థం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాపు కులస్థుల ఓట్లను రాబట్టడానికి వంగవీటి రంగా పేరును మళ్ళీ వాడుకోవడానికి టీడీపీ చూస్తుంది. అందుకే రాధకు ఈసారి ఎన్నికల్లో సీట్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు రాధకు సీట్ ఇస్తామని చెప్పడంతో విజయవాడ సెంట్రల్ లో ఉన్న టీడీపీ నాయకులకు వణుకు పట్టుకుంది. అక్కడే గతంలో టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడి నుండే రాధకు సీట్ ను చంద్రబాబు నాయుడు కంఫర్మ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా జనసేన నాయకుల నుండి ఈ స్థానానికి గట్టి పోటీ ఉంది. పైగా రెండు పార్టీలు పొత్తులో ఉండబోతున్నాయి కాబట్టి ఈ స్థానానికి విపరీతమైన డిమాండ్ ఉంది.
రాధకు ఇస్తారా!!
2019 ఎన్నికల వేళ వంగవీటి రాధా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం సాగింది.జనసేన కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న సమయంలో వంగవీటి రాధా జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగింది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటితో భేటీ అయ్యారు. కానీ, ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తు ఖాయం కావటంతో టీడీపీ నుంచే రాధా పోటీ చేసే విధంగా ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాధా 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ కేటాయించని కారణంగానే పార్టీ వీడారు. ఇప్పుడు అదే సీటు టీడీపీ నుంచి ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
వాళ్ళ పరిస్థితి ఏందీ మరీ!!
విజయవాడ సెంట్రల్ నుండి టీడీపీ పార్టీ కోసం బోండా ఉమా చాల కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ సీట్ ను రాధకు ఇస్తే ఉమా ఎలా రియాక్ట్ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. ఇప్పుడు వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ కేటాయిస్తే బోండా ఉమాకు ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారనే చర్చ సాగుతోంది. ఉమా పోటీ చేస్తే సెంట్రల్ నుంచి మాత్రమే చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇస్తే ఉమా రాజీ పడతారా..లేక, కొత్త నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో చర్చకు కారణం అవుతోంది. గెలుపు గుర్రాలకే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వాలని చూస్తున్న టీడీపీ కాపు ఓట్ల కోసమైనా రాధకు సీట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.