KTR: వైసీపీని కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేశారు!!

Arjun

KTR:రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరాసా వైసీపీకి సత్ససంబంధాల గురించి అందరికి తెలుసు. గత ఎన్నికల్లో తెరాసా వైసీపీకి విధానం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది. నేరుగా ఏపీకి వెళ్లి మరీ తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీకి మద్దతు తెలిపారు.

is telangana minister ktr insulting Ap government

అలాగే వైసీపీకి పోటీగా ఉన్నా టీడీపీని ముప్పుతిప్పలు పెడ్తూ, వైసీపీ గెలుపుకు కేసీఆర్ చాల సహాయం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సీఎంగా గెలిచిన తర్వాత కేసీఆర్ తో తరచూ చర్చలు జరిపే వారు.

కేటీఆర్ ఏపీని అవమానించారా!!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కల్సి ఉన్న తీరు చూసి టీడీపీ నాయకులకు వణుకు పుట్టింది. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. ఏపీలో పవర్ లో లేదు, రోడ్స్ మంచిగా లేవు, రాష్ట్రం అద్వానంగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీని అవణించినట్టు కాదని, ఉన్న వాస్తవాన్నే కేటీఆర్ చెప్పారని, ఈ వ్యాఖ్యలు చేసేలా రాష్ట్రాన్ని తయారు చేసిన వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.

ఇద్దరికీ చెడిందా!!

కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్నేహాన్ని చూసి రెండు రాష్ట్రాల ప్రజలు అప్పట్లో ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చుస్తే ఇద్దరికీ చెడిందని స్పష్ఠంగా అర్ధమవుతుంది. అయితే దీనికి కారణం బీజేపీ అని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పోరాటంలో కలిసి రాలేదన్న కోపమే ఈ దూరానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే టీడీపీ నాయకులూ ఈ చిన్న మాట మాట్లాడినా భూతుల వర్షం కురిపించే వైసీపీ నాయకులు కేటీఆర్ విషయంలో మాత్రం ఆ రేంజ్ లో స్పందించలేకపోతున్నారు.

- Advertisement -