JANASENA: జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తన కోసం పెట్టాడో లేదా పక్క పార్టీ వాళ్ళను సీఎం సీట్ లో కూర్చోబెట్టడానికి పెట్టాడో అర్ధం కాదు. ఎందుకంటే ఎప్పుడు తన వాళ్ళ ఇతరులు లాభపడే పనులనే పవన్ చేస్తూ ఉంటారు. పవన్ ఇతర పార్టీల నేతలు వాడుకుంటున్నారని ప్రజలకు కూడా అర్థమైతుంది కానీ పవన్ కు మాత్రం కావడం లేదు.

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్, ఓడిపోయినప్పటికీ తన ఉద్దేశాన్ని మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాడు. అది చాలా మందికి నచ్చింది కూడా. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాన్ని చుసిన పవన్ తర్వాత బీజేపీతో పొత్తుపెట్టుకొని వాళ్లకు ఎలివేషన్ ఇచ్చే పని పెట్టుకున్నారు.
మైత్రి చెడిందా!!
అసలు ఏపీలో బీజేపీ ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. అలాంటి పార్టీ నేతలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను అనుమానించే స్థాయికి వెళ్లారు. గత కొద్దీ రోజులుగా జనసేన, టీడీపీ మళ్ళీ రానున్న రోజుల్లో పొత్తు పెట్టుకోనున్నాయని వార్తలు వస్తుండటంతో వాటిని నిజమని నమ్మిన బీజేపీ పవన్ పై ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణే తమ అలియెన్స్ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పిన నేతలు ఇప్పుడు జనంతో పొత్తు పెట్టుకుంటామని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ప్రజల నుండి ఎలాంటి మద్దతు లేని బీజేపీ లాంటి నాయకుల తో పవన్ అనిపించుకోవలసిన అవసరం ఏముందో.
పవన్ లేకుంటే బీజేపీ ఉందా!!
ఏపీలో బీజేపీ జెండా ఇంకా కనిపిస్తుందటే అది జనసేన వల్లే. అలాంటి బీజేపీ నాయకులు పవన్ పై విమర్శలు చేస్తూ తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారు. పవన్ కు ఉన్న మద్దతునే ఇంకా అక్కడక్కడా బీజేపీ జెండాలు కనిపిస్తున్నాయి. జనసేనతో ఉన్న పొత్తును తెంచుకుంటే బీజేపీకి ఏపీలో అసలు పుట్టగతులే ఉండవు. ఈ విషయం తెలిసినా కూడా బీజేపీ నాయకులు తమ వల్లే పవన్ ఉన్నారనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని అనుమానాల మధ్య ఈ పొత్తు అసలు రానున్న ఎన్నికల వరకు ఉంటుందో లేదో వేచి చూడాలి.