Pawan Kalyan: టీడీపీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఆఫీసియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కానీ పొత్తు దాదాపు కంఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు పొత్తు వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ పొత్తు గురించి రెండు పార్టీలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి పొత్తు ఉంటుందో లేదో అన్న అనుమానాలు కూడా ఇంకా ఉన్నాయ్. పైగా ఈ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుందో కూడా ఇంకా క్లారిటీ లేదు. దీంతో ఇప్పటి నుండి పార్టీ కోసం పని చేసినా కూడా, అది తమకే వస్తుందో లేదో అన్న డౌట్ తో టిడిపి నాయకులు పార్టీ కోసం బలం పని చెయ్యడం లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి కంప్లయింట్స్ వస్తున్నాయి. అయితే ఈ కంప్లయింట్స్ ను చంద్రబాబు నాయుడు సిరీస్ గా తీసుకున్నారని, పార్టీ కోసం పని చెయ్యని వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
జనసేన కొంప ముంచేలా ఉందే!!
జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపిని ఓడించడం ఈజీ అవుతుందని అంతా చంద్రబాబు నాయుడు అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పొత్తు వల్ల టిడిపి కార్యకర్తలు, నేతలు సరిగ్గా పార్టీ కోసం పని చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఏ నియోజక వర్గం ఏ పార్టీకి వస్తుందన్న క్లారిటీ లేకపోవడం వల్ల టిడిపి నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటి నుండి పార్టీ కోసం పని చేసి, డబ్బులు ఖర్చు పెట్టినా కూడా చివరి నిమిషంలో ఆ నియోజక వర్గం సీట్ వేరే పార్టీకి వెళ్తే, తాము పెట్టిన డబ్బు, పడిన కష్టం వృధా అవుతాయని భయపడి, టిడిపి నాయకులు పార్టీ కోసం బలంగా కస్టపడటం లేధు. ఈ విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలవరపెడుతుంది. ఈ విషయాన్ని సిరీస్ గా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు నియోజక వర్గ సమీక్షల్లోనూ, పార్టీ మీటింగ్స్ లలోనూ ఇదే విషయాన్ని చెప్తున్నాడని, సీట్ గురించి ఆలోచించకుండా పార్టీ కోసం పని చేయాలని, కష్టపడ్డావాళ్లను పార్టీ ఎప్పటికీ వదులుకొదని బాబు హామీ ఇస్తున్నట్టు సమాచారం.
క్లారిటీ ఎప్పుడిస్తారయ్యా!!
టిడిపి-జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో ఖాయామని అందరికీ తెలుసు కానీ ఈ రెండు పార్టీలు మాత్రం అఫిసియల్ గా ప్రకటించడం లేదు. అఫిసియల్ గా ప్రకటించి, ఏ నియోజక వర్గం ఏ పార్టీకి వస్తుందో అన్న విషయంపై క్లారిటీ ఇస్తే, వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ నాయకులు కష్టపడుతారు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లే ఇప్పుడు నాయకులు పార్టీ కోసం సరిగ్గా పనిచేయడం లేదు. జనసేనకు ఎలాగూ పని చేసే నాయకులు కొంతమందే ఉన్నారు వాళ్ళు కూడా పదవి ఆశించకుండా పని చేసే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ క్లారిటీ లేకపోవడం వల్ల జనసేనకు వచ్చే నష్టం కంటే కూడా టిడిపికి వచ్చే నష్టమే ఎక్కువ. కాబట్టి పొత్తు క్లారిటీ ఇస్తే రెండు పార్టీలకు మంచిది. లేకపోతే ఈ విషయాన్ని వాడుకుంటూ , టిడిపి నాయకులను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉంది.