Venkaiah Naidu: జులై 24న ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం ముగియబోతుంది. దింతో నెక్స్ట్ రాష్ట్రపతి ఎవరన్న విషయంపై దేశం మొత్తం చర్చజరుగుతుంది. అయితే ఎన్డీయే తరపు అభ్యర్థుల గురించి కానీ ప్రతిపక్షాల అభ్యర్థుల గురించి కానీ ఇంకా ఎవరి పేర్లు ఖచ్చితంగా, ఆఫీసియల్ గా ఎవరి పేర్లు బయటకు రాలేదు. అయితే కొన్ని పేర్లు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రధానమంత్రి నార్త్ నుండి ఉంటె సౌత్ నుండి రాష్ట్రపతి ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని ఎవ్వరు పాటించడం లేదు. అయితే ఈసారి రాష్ట్రపతిగా మాత్రం సౌత్ నుండే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే సౌత్ లో బలపడటానికి బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి సౌత్ వ్యక్తికే రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది.
వెంకయ్య నాయుడు రాష్ట్రపతా!!
ఎన్డీయే తరపున రాష్ట్రపతిగా సౌత్ నాయకుడినే నిలబడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే దింతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళసై పేరు కూడా వినిపిస్తుంది. ఇదే సమయంలో గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు బీజేపీ వర్గాలు గతంలోనే తెలిపింది.అయితే ప్రతిపక్షాల పార్టీ నుండి ఏ అభ్యర్థి ఉంటారో ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కేసీఆర్ కూడా మొదట రాష్ట్రపతి ఎన్నికల కోసం కూటమి ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నించారు కానీ అది కుదరకపోవడం వల్ల మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు.
సౌత్ ప్రజల మద్దతు కోసమేనా!!
సౌత్ లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో తన బలాన్ని బీజేపీ చూపిస్తుంది ఆలాగే తెలంగాణాలో కూడా బీజేపీ కొంతమేరకు బలపడింది. ఇంకా ఎక్కువగా ప్రజల మద్దతు పొందటానికి బీజేపీ ఈసారి సౌత్ వ్యక్తిని రాష్ట్రపతిగా ఎంపిక చేయనుందని వార్తలు వినిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు జరిపిందని, మరో పది రోజుల్లో అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.