YS Jagan: మొన్న వైజాగ్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి దాదాపు 13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వైసీపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయితే ఈ పెట్టుబడుల విషయంలో ఇప్పుడు వైసీపీ-టీడీపీ మధ్య విమర్శలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విషయంలో వైసీపీ వాళ్ళు ఎందుకు పూర్తి వివరాలు ఇవ్వడం లేదని, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీల వివరాలు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివరాలు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ వివరాలు అడగటం వెనక టీడీపీ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ వైసీపీ మాత్రం తప్పించుకొని తిగుతునట్టు తెలుస్తుంది.

వైసీపీ ఎందుకు చెప్పడం లేదు
“పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విదేశీ కంపెనీలు ఎన్ని, దేశీయ కంపెనీలు ఎన్ని, ఆ కంపెనీలు పెట్టె పెట్టుబడులు ఎన్ని, వాటిని ఎక్కడ స్థలాలు కేటాయించారు, వాటి వల్ల ఇక్కడి యువతకు ఎన్ని జాబ్స్ వస్తాయి ” అని టీడీపీ నాయకులు వైసీపీ అడుగుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు. ఈ వివరాలు ఇవ్వకపోవడం వల్ల ఆ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంతవరకు నిజమన్న అనుమానం ప్రజల్లో కూడా వస్తుంది. మొన్న మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ఈ 13లక్షల కోట్ల పెట్టుబడులు అన్నీరాష్ట్రానికి ఖచ్చితంగా వస్తాయని చెప్పలేమని, వాటిలో చివరి నిమిషంలో కాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు. ఇలా ఇప్పుడు ఆ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీల వివరాలు ఇవ్వకపోవడంతో ప్రజల్లో కూడా ఈ పెట్టుబడుల విషయంలో అనుమానాలు వస్తున్నాయి.
టీడీపీ ఇచ్చేదా!!
ఇప్పుడవి వైసీపీ వాళ్ళను వివరాలు అడుగుతున్న టీడీపీ నాయకులు, తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అలాంటి వివరాలు ఎప్పుడూ ఇవ్వలేదు. వాళ్ళు చెయ్యరు కానీ వేరే ప్రభుత్వాలు చెయ్యాలని డిమాండ్ చేస్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వివరాలు ప్రజలకు ఇచ్చి ఉంటె, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాల్సి వస్తుండే. కానీ టీడీపీ ఇలాంటి బుద్ది ఉండదు కానీ వేరే వాళ్లకు ఉండాలని డిమాండ్ చేస్తారు. ఈ వివరాలు టీడీపీ అడుగుతుంది ప్రజలకు ఆ వివరాలు తెలియడానికి మాత్రం అయ్యిండదు. ఆ వివరాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడానికో, ఆ కంపెనీలను బెదిరించి డబ్బులు తీసుకోవడానికో ఉపయోగపడుతాయని అడుగుతున్నారు.