Y.S JAGAN MOHAN REDDY: దావోస్ నుండి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.అసలు దావోస్ నుండి రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పకుండానే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే ఈ విషయమే ఇప్పుడు రాష్ట్రంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్లొచ్చు కానీ దాని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం ఉందొ కూడా వెళ్లొచ్చిన ప్రతిసారి చెప్పాలని సోషల్ మీడియాలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐన జగన్ ఎదో పక్క గ్రామానికి వెళ్లినట్టు నెలకు ఒకసారి ఢిల్లీ వెళ్తూ ఉంటారు,

అయినా రాష్ట్రం యొక్క ఒక్క డిమాండ్ కు కూడా కేంద్రం ఇప్పటి వరకు సిగ్నల్ ఇవ్వలేదు. రాష్ట్రానికి ఉన్న డిమాండ్స్ గురించి ముఖ్యమంత్రి అక్కడ చర్చిస్తున్నారా లేదా అన్న విషయంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఎందుకంటే జగన్ ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి కొత్త అప్పులు ఏమైనా వస్తున్నాయేమో కాని రాష్ట్రానికి మరొక్క ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఒక్క డిమాండ్ కు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ లాంటి డిమాండ్స్ ఉన్నాయ్ . వీటన్నింటి గురించి అసలు జగన్ కేంద్రం దగ్గర చర్చిస్తున్నారా అన్నది రాష్ట్ర ప్రజలకు ఉన్న డౌట్.
కేవలం సొంత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని, రాష్ట్ర ప్రయోజాలు ప్రభుత్వానికి పట్టదని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కేవలం అప్పుల తెస్తూ, వాటిని నొక్కేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి వాడుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని ప్రతిపక్షాలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పుడు విమర్శలు చేస్తున్న పార్టీలు కూడా గతంలో డబ్బులు నొక్కేసి ఇప్పుడు నొక్కెయ్యడానికి లేదన్న బాధ తప్ప రాష్ట్రానికి ఎదో అయిపోతుందన్న భాద కాదు. ఈ రాజకీయ నాయకులను నమ్ముకోవడం కంటే పెద్ద బుద్ది తక్కువ పని లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చర్చించనప్పుడు ప్రజల డబ్బుతో ఇలా తిరగడం ఎందుకని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.