YS JAGAN MOHAN REDDY:వైసీపీ నాయకులు గత కొన్ని రోజుల నుండి టిడిపి మీద కంటే కూడా జనసేన కదలికలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జనసేన అధినేత ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై జనసేన కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా ఆరా తీస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా దానిపై వైసీపీ కార్యకర్త నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీట్ మాత్రమే గెలిచిన జనసేనకు వైసీపీ భయపడుతుందంటేనే ఎన్నికల తర్వాత జనసేనకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ ఏంటో అర్ధమవుతుంది. ఇన్నాళ్లు టీడీపీ ఎలా దెబ్బతీయాలని ప్రయత్నించినా వైసీపీ ఇప్పుడు పవన్ పై పథకాలు వెయ్యడంలో బిజీగా ఉన్నారు.
జగన్ కు పవన్ భయం
151 సీట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ పాలనా విధానంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. దింతో వైసీపీ నాయకులు తమకు వ్యతిరేకంగా చిన్న గాలి వచ్చినా భయపడుతున్నారు. అలాంటి సందర్భంలో పవన్ లాంటి నాయకుడి జగన్ కూడా భయపడుతున్నారు. పవన్ ఇమేజ్ ను దెబ్బతియ్యాలని టీడీపీ దత్తపుత్రుడని ప్రభుత్వ సభల్లో కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ సభల్లో అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ ఇలా ప్రభుత్వ సభల్లో కూడా పవన్ ను దెబ్బకొట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
మళ్ళీ సింపతీ కార్డు కోసమేనా!!
2019 ఎన్నికల్లో ఒంటరిగా వస్తున్నా తల్లీ, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా అంటూ జగన్ సంపాదించిన సింపతీ ఇప్పట్లో ఏ నాయకుడూ సంపాదించలేడు. టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసిన వైసీపీ నాయకుల ఇప్పుడు కూడా సేమ్ అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. మళ్ళీ టీడీపీ, జనసేనను ప్రజల దృష్టిలో ఒక్కటిగా చూపి, జనసేనను దెబ్బతియ్యడానికి వైసీపీ నాయకులు వేసిన పెద్ద కుట్ర ఇది.