Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 27నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. అయితే ఈ పాదయాత్రకు యువగళం అని పేరును పెడుతూ, రాష్ట్రంలో ఉన్న యువతను ఆకర్షించడానికి టీడీపీ నాయకులు వ్యూహాలు రచించారు. అయితే ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ కూడా చాల ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఏ నాయకుడు పాదయాత్ర చేసినా కూడా రాష్ట్రం మొత్తం ఓకేసారి అనుమతి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వైసీపీ ఆలా చెయ్యడం లేదు. జిల్లాల వారీగా అనుమతి ఇస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇలా అనుమతి ఇవ్వడం వెనక వైసీపీ వ్యూహముందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా జిల్లాల వారీగా అనుమతి ఇస్తే, ఇష్టమొచ్చినప్పుడు పాదయాత్రను అడ్డుకోవచ్చనే ప్లాన్ తో ఇలా చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

జగన్ భయపడ్డడా!!
నారా లోకేష్ వైసీపీ వాళ్ళు అంటున్నట్టు కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు అలాంటి నేతను చూసి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు లోకేష్ చేస్తున్న పాదయాత్రకు రాష్ట్రం మొత్తం ఒకేసారి అనుమతి ఇవ్వొచ్చు కానీ వైసీపీ ఇవ్వడం లేదు. ఎందుకంటే లోకేష్ చేస్తున్న పాదయాత్ర యువతను ఆకర్షిస్తుందని వైసీపీ తెలుసు. వైసీపీ చేస్తున్న పాలన గురించి పెద్దవాళ్లకు తెలియపోవచ్చు కానీ యువత మాత్రం వైసీపీ పాలన పట్ల చాల ఆగ్రహంగా ఉంది. కేవలం పథకాలను అమలు చేస్తూ, జాబ్స్ విషయం ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని, కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా తమను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి ఇప్పుడు లోకేష్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలాంటి షరతులతో కూడిన అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది.
పాదయాత్ర ప్రభుత్వం ఉంటుందా!!
నారా లోకేష్ రాజకీయాల్లో ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకుగానే ఉన్నాడు. ఇంకా తనకంటూ సొంత గుర్తింపును రాజకీయాల్లో తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చేస్తున్న పెద్ద పనిగా చెప్పొచ్చు. గతంలో కనీసం మాట్లాడటానికి కూడా లోకేష్ కు వచ్చేది కాదు. కానీ ఈమధ్య మాటల్లో లోకేష్ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలపై కూడా చాలా గట్టిగా పట్టు సాధించారు. ఇప్పుడు లోకేష్ చేస్తున్న పాదయాత్ర రానున్న ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. ఎలాగో వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ పాదయాత్ర ఫలితం టీడీపీకి ఖచ్చితంగా దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.