Ys Jagan Mohan Reddy: జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా పెద్దగా ఏపీని అభివృద్ధి పథంలో ఏమి నడిపించలేదు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని పతనానికి దగ్గరగా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దేశంలో ఉన్న పేద రాష్ట్రాల కంటే కూడా చాలా దారుణంగా ఉంది. ఎంతో వెనకపడిన బీహార్ కంటే కూడా చాలా దారుణమైన స్థానంలో ఏపీ ఉంది. అయితే ఈ విషయాన్నీఎవరో కాదు ప్రకటించింది ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఈ విషయాన్నీ వైసీపీ ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు తమని మద్దతు తెలిపే కేంద్రం ఇచ్చిన ర్యాంక్ లలోనే ఏపీ పరిస్థితి ఇలా ఉంటె ఇంకా మిగితా వాటిలో ఏపీ విషయం ఇంకా ఇంతా దారుణంగా ఉంటుందో ఊహకే అందటం లేదు.

అయితే ఇప్పుడు రాష్ట్రం ఇంతా దీన స్థితికి వెళ్లినా కూడా వైసీపీ మాత్రం పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోంది.
చివరి స్థానం
ఇప్పుడు కేంద్రం స్టార్టప్స్ ఎకో సిస్టం బాగున్న రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో ఏపీ చిట్ట చివరన నిలిచింది. మన కంటే బీహారే నయమని ర్యాంకులు ప్రకటించారు. ఏ కేటగిరిలో గుజరాత్, కర్ణాటక అగ్రస్థానంలో నిలిచాయి. బి కేటగిరిలో మేఘాలయ అగ్రస్థానంలో నిలిచింది. ఏ కేటగిరి అంటే కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, బీ కేటగిరి అంటే కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు. కేటగిరి ఏలో గుజరాత్, కర్ణాటక తర్వాత తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అసోం , బీహార్, ఆంద్రప్రదేశ్ వరుసగా నిలిచాయి. బీహార్ కంటే కూడా వెనకపడటం కేవలం వైసీపీ ప్రభుత్వానికే సాద్యమైన పని. అయినా ఇష్టమొచ్చిన రూల్స్ పెడితే, యువతకు ఎలాంటి సపోర్ట్ కార్యక్రమాలు చెయ్యకుండా ఉంటె ఇలా చివరి స్థానం కాకుండా ఇంకే స్థానమో ఎందుకు వస్తుంది.
ఇప్పటికైనా పట్టించుకుంటుందా!!
వైసీపీకి ప్రజల అభివృద్ధి లాంటి విషయాలు అస్సలు పట్టించుకోడు. కేవలం ప్రతి విషయాన్నీ రాజకీయం చెయ్యడం మాత్రమే తెలుసు. మొన్న ఎప్పుడో ఈజీ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంక్ వస్తే ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఈ విషయాన్నీ ఎలా చెప్తుందో చూడాలి. అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్లకు ఇలాంటి ర్యాంక్స్ అవసరం కానీ కేవలం అధికారం కోసం మాత్రమే ఆశించే వైసీపీ ఇలాంటి పట్టించుకుంటుందని అనుకోవడం మూర్ఖత్వమే.