jaganmohanreddy:పరిపాలన ఇంత ఘోరంగా ఉన్నా కూడా 175 సీట్స్ వైసీపీ రానున్న ఎన్నికలలో గెలవగలదా!!

Arjun

jaganmohanreddy: ప్రజల మద్దతుతో, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, బై, బై నినాదాలతో 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మొత్తం 175 సీట్స్ గాను 175 గెలవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయలకు, కార్యకర్తలకు ఆదేశాలు చేశారు.

is ysrcp going to win 175 seats in upcoming elections?

మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, ప్రతిపక్షం రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చెయ్యాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ రాష్ట్ర చేసిందేమి లేదు. రాష్ట్రాన్ని మరింత దీనావస్థలోకి నెత్తిన వైసీపీకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ, అధికారం వచ్చిన తర్వాత వాటిలో ఒక్కదాన్ని కూడా సంపూర్తిగా నెరవేర్చకుండా, అన్నింటిని పెండింగ్లో పెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాలు రావడం లేదు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కరెంటు కోతలు, మధ్య నిషేధం అమలు చేస్తానని చెప్పి, రేట్లు పెంచి మరీ మద్యాన్ని రాష్ట్రంలో అమ్ముతున్నారు.

ఇసుక దందా కూడా వైసీపీ నాయకత్వంలో తీవ్రస్థాయికి చేరుకుంది. అలాగే వైసీపీ అధికారంలో రోడ్ల పరిస్థితి దారుణమైన స్థాయికి చేరుకుంది. దాదాపు రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు సరిగ్గా లేవు. పెట్రోల్, డీజిల్ లపై కేంద్రం కంటే ఎక్కువ పన్నును విధిస్తూ, తెలంగాణ కంటే కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయ్. అలాగే రాష్ట్రానికిన్ ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, ఇప్పుడు బీజేపీకి భజన చేస్తూ, ప్రధాని మోడీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధానిపై స్పష్టత తీసుకోని రాలేకపోయారు. ప్రజల సమస్యలను వదిలేసి, మూవీ ఇండస్ట్రీపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ, వైఎస్ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలా రాష్టాన్ని అప్పుల పాలు చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లి, 175 స్థానాలను గెలుస్తామని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారో వైసీపీ నాయకులకే తెలియాలి.

- Advertisement -