Ys Jagan Mohan Reddy: వైసీపీ ప్రభుత్వం తన ఉనికిని చాటుకోవడానికి ఏం చెయ్యాలో తెలియక గత కొన్ని రోజుల నుండి సినిమా ఇండస్ట్రీపై పడిపోతుంది. ఇలా చేస్తే ప్రజల్లో పబ్లిసిటీ కావలసినంత వస్తుందని వైసీపీ ప్రభుత్వం ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం సినీ ఇండస్ట్రీని కావలసినంత ఇబ్బందులకు వైసీపీ ప్రభుత్వం గురి చేసింది, ఇంకా చేస్తునే ఉంటుంది. మొన్నటి వరకు సినిమా పరిశ్రమను ఇబ్బందులకు గురి చేసి, ఇప్పుడు అదే పరిశ్రమపై పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తుంది . ఇష్టమొచ్చినట్టు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇలా ఇష్టమొచ్చినట్టు డబ్బులు దోచుకుంటుంది. ఇప్పుడు సినిమా టికెట్స్ ను తానే అమ్మి డబ్బులు దొబ్బడానికి వైసీపీ ప్రభుత్వం పథకం రచించింది. ఇలా అమ్ముతూ, ఆ డబ్బును ప్రభుత్వాన్ని నడపడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది.

ఇప్పటికే ఎన్నోసార్లు నూతన విధానాలను ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
యువర్స్ స్క్రీన్
బుక్ మై షో లాంటి యాప్ అంజు వైసీపీ ప్రభుత్వం కూడా లాంచ్ చేయనుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మేందుకు యువర్ స్క్రీన్స్ పేరుతో పోర్టల్ లాంఛ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందులో సినిమా టిక్కెట్లు తక్కువ ధరకే లభిస్తాయని ఏపీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని, అదే సమయంలో ఇతర టిక్కెట్ పోర్టళ్లలో తీసుకునే సర్వీస్ చార్జీని తాము వసుూలు చేయబోమని చెబుతున్నారు. అంటే.. బుక్ మై షో లాంటి యాప్స్ లో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. వాటితో పాటు ప్రభుత్వ టిక్కెటింగ్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారన్న మాట. ఇలా చెయ్యడం వల్ల ప్రజలపై దాదాపు రూ . 20ల భారం తగ్గుందని అధికారులు చెప్తున్నారు.
దొంగ లెక్కలు చెప్తున్నారా!!
వైసీపీ ప్రభుత్వానికి దొంగ లెక్కలు చెప్పడం చాలా సహజం. ప్రభుత్వ పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాగైతే దొంగ లెక్కలు చెప్తుందో అలాగే ఇప్పుడు యువర్స్ స్క్రీన్ విషయంలో కూడా దొంగ లెక్కలు చెప్తుంది. ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, యువర్ స్క్రీన్స్ యాప్‌లో కేవలం కేవలం 1.95 శాతం వసూలు చేస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం సున్నాశాతం వసూలు చేస్తుందని దొంగ లెక్కలు చెప్తుంది. వసూలు చేస్తున్నప్పుడు ఇలా దొంగ లెక్కలు చెప్పడం ఎందుకని రాజకీయ విశ్లేషకులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.