YSRCP :రాజాకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీపై పెత్తనం చెలాయించడం, వాళ్ళను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు జరుగుతూనే ఉంటాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందటానికి కూడా వైసీపీపై టీడీపీ చేసిన చీప్ రాజకీయాలే కారణం. ఇప్పుడుసేమ్ అలంటి రాజకీయాలే వైసీపీ కూడా టీడీపీపై చేస్తుంది. అంతకంటే ఎక్కువే చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ టీడీపీ నాయకులను మరీ ఘోరంగా ఆడుకుంటున్నారు.

ఎంతలా అంటే తమ్ పార్టీలో చేరకపోతే, తమతో కలవకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించేంతలా తమను హింస్తున్నారని టీడీపీ నాయకులు కోర్ట్ లను ఆశ్రయిస్తున్నారు.
ఎన్కౌంటర్ నిజమేనా!!
టీడీపీ నాయకులను సజ్జల తన చేతిలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, బెదిరిస్తున్నారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. తనను రెండు నెలలు జైల్లో పెట్టక ముందు వైసీపీ తరపున ఒక లాయర్ తనను కలిసి, జగన్ తనపై కోపంగా ఉన్నారని, వైసీపీలో చేరకపోతే తనను చంపేస్తామని బెదిరించారని పక్కా సాక్ష్యాలతో ప్రభాకర్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఇలాగే కృష్ణ జిల్లాలో ఉన్న టీడీపీ నాయకుడిని కూడా బెదిరించారని, దాంతో అతను వైసీపీలో చేరారని ప్రభాకర్ వెల్లడించారు. టీడీపీ నాయకులను బెదిరించాడు వైసీపీ మరీ ఇంతలా దిగజారుతుందని అనుకోలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
టీడీపీ పరిస్థితే వైసీపీ
గతంలో వైసీపీని వేదించడానికే తాము అధికారంలోకి వచ్చామన్నట్టు ప్రవర్తించిన టీడీపీకి జనాలు చాలా బాగా సమాధానం చెప్పారు. టీడీపీ కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. అలాగే ఇప్పుడు టీడీపీని వేధించడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి కూడా రానున్న రోజుల్లో ప్రజలు ఇలాంటి సమాధానమే ఇవ్వనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ చేస్తున్న పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది, అలంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి చీప్ రాజకీయాలు వైసీపీ చేస్తే ప్రజల్లో ఉన్న ఆ కాస్త ఆదరణ తగ్గి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంటే ఘోర పరాజయాన్ని వైసీపీ చూడనుంది.